కూతురు గురించి ఆ తండ్రి రెస్యూమ్ లో ఏం రాశాడో చూస్తే ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు.! ఎందుకో చూసి నవ్వుకోండి.!     2018-08-24   10:54:55  IST  Sai Mallula

ఉద్యోగం కోసం ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లే వారు క‌చ్చితంగా త‌మ వెంట రెజ్యూమ్ తీసుకెళ్తారు. ఈ విష‌యం గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా తమ రెజ్యూమ్‌లో త‌మ గురించిన అనేక విష‌యాల‌ను రాస్తారు. వాటిలో చాలా ఉంటాయి. చ‌దువు, ఇత‌ర నైపుణ్యాలు, ఉద్యోగం చేసి ఉంటే ఆ ప‌ని వివ‌రాలు, అనుభ‌వం, వ్య‌క్తిగ‌త హాబీలు, చిరునామా… ఇలా రెజ్యూమ్‌లో పెట్టే అంశాలు చాలానే ఉంటాయి. కానీ కొంద‌రు రెజ్యూమ్‌ను క్రియేట్ చేసుకోవ‌డంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. దీని వ‌ల్ల ఉద్యోగం ఇచ్చే వారికి అభ్య‌ర్థిపై త‌ప్పుడు ఇంప్రెష‌న్ ప‌డుతుంది. కానీ మరికొందరు అదే రెస్యూమ్ ని చాలా క్రియేటివ్ గా రాస్తారు.

Dad Writes A Hilariously Savage CV For His Teenage Daughter-

Dad Writes A Hilariously Savage CV For His Teenage Daughter

కానీ బ్రిటన్‌కు చెందిన ఓ తండ్రి రాసిన రెజ్యూమ్‌ని చూస్తే జాబ్‌ మాట దేవుడెరుగు.. కనీసం ఇంటర్వ్యూకు కూడా పిలవరు. అంత దారుణంగా ఏం రాశాడా అనుకుంటున్నారా.? అయితే మీరే చూడండి!

బ్రిటన్‌కు చెందిన ఒక యువతి తన కోసం రెజ్యూమ్‌ రాసివ్వమని తన తండ్రిని అడిగింది. అందుకు తండ్రి కూతురు కోసం అద్భుతమైన రెజ్యూమ్‌ని తయారు చేసిచ్చాడు. ఆ తండ్రి రాసిన రెజ్యూమ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసి అందరు తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆ తండ్రి తన కూతురు గురించి చాలా నిజాయితీగా.. నిజాలు మాత్రమే రాసాడు.

Dad Writes A Hilariously Savage CV For His Teenage Daughter-

ఇంతకూ ఆ రెజ్యూమ్‌లో ఏం ఉందంటే.. క్వాలిఫికేషన్‌ వివరాల దగ్గర కూతురుకి ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయనేది మాత్రమే కాక, ఎన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్‌ అయ్యిందనే విషయాన్ని కూడా రాశాడు. బాధ్యతల దగ్గర.. చెప్పిన మాట వినకపోవడం, ఫేస్‌బుక్‌లో బ్రౌజ్‌ చేయడం, ముఖ్యమైన పత్రాలను పోగొట్టడం, విలువైన సమాచారాన్ని శత్రువులకు చేరవేయడం అని తెలిపాడు. ఇక విధుల్లో భాగంగా బంగారం గురించి అన్వేషిస్తూ.. తవ్వకాలు జరపడం, తల ఎగరేయడం, ఇతరుల పట్ల దారుణంగా ప్రవర్తించడం అని రాశాడు. ఇక వ్యక్తిగత నైపుణ్యాల్లో బద్దకస్తురాలు, మొద్దు, జగమొండి, గర్వంగా ప్రవర్తిస్తుంది అని తెలిపాడు.

ఈ రెస్యూమ్ ని ఆ యువతి ఫేస్బుక్ లో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఆ రెస్యూమ్ మీరు కూడా ఒక లుక్ వేయండి. కానీ ఇంటర్వ్యూలకు మాత్రం అలాంటిది పట్టుకెళ్ళకండి. ఇప్పుడైతే చూసి నవ్వుకోండి!