వైరల్ వీడియో : డ్యాన్సింగ్ అంకుల్ మళ్లీ తన డ్యాన్స్ తో అదరగొట్టాడు... నెటిజన్లు ఫిదా..     2018-09-03   10:03:50  IST  Rajakumari K

డాన్సింగ్ అంకుల్ సంజీవ్ శ్రీవాత్సవ అలియాస్ డబ్బూ ది డాన్సర్ గుర్తున్నాడా ?? ఓ వెడ్డింగ్ స్టేజీ మీద గోవింద స్టెప్పులు వేసి అదరగొడితే నెటిజన్లు ఫిదా అయి ఓవర్ నైట్ స్టార్ ని చేసేశారు..మనోడి ఈ ఏజ్ లోనే ఇలా ఉన్నాడంటే ఆ ఏజ్ లో ఎలా ఉండేవాడు అని అనుకోని వారుండరు డబ్బూ డ్యాన్స్ చూసిన నెటిజన్లు..రాత్రికి రాత్రి స్టార్ అయిన డబ్బూ ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు…


డ్యాన్స్ వీడియో చూస్తున్నంత సేపు తన స్టెప్స్ తో అదరగొడుతూ రెప్ప వేయకుండా చూసేలా చేస్తాడు ఈ అంకుల్ ..గోవింద డాన్స్ తర్వాత హృతిక్ రోహన్ డాన్స్ చేసి మైమరపించిన డబ్బూ తాజాగా మిథున్ చక్రవర్తి సాంగ్ జూలీ జూలీకి డాన్స్ వేసి సోషల్ మీడియాని ఉర్రూతలూగించాడు. మళ్లీ నెటిజన్లకు మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. జీతా హైన్ షాన్ సే అనే సినిమాలోని జూలీ జూలీ జూలీ సాంగ్ కి మనోడు చేసిన డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవ్వడంతో పాటు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. మీరూ చూసి ఎంజాయ్ చేయండి…