ఆర్.ఎక్స్. 100 ను మించిన రథం..! టీజర్ ను తిడుతూ యూట్యూబ్ లో ఎలా కామెంట్స్ చేసారో చూడండి!     2018-08-21   04:22:55  IST  Sai Mallula

టాలీవుడ్ లో చిన్న సినిమాలకు ఇటీవల అందుతున్న క్రేజ్ మాములుగా లేదు. కంటెంట్ ఏ మాత్రం కొత్తగా ఉన్నా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టేస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాగా ఆర్ఎక్స్ 100 నిలిచింది. సినిమాలో మసాలా ఎక్కువైందని సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నప్పటికీ యూత్ మాత్రం సినిమాను తెగ చూసేస్తున్నారు. అర్జున్ రెడ్డి తరహాలోనే అడల్ట్ సన్నివేశాలు ఉన్నప్పటికీ యూత్ కి బాగా నచ్చింది ఈ సినిమా. RX100 మూవీలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోయటమే కాదు మతి పోయేలా లిప్ లాకులు చేసింది పాయల్ రాజపుత్.

Comments On Ratham Movie Teaser-

Comments On Ratham Movie Teaser

ఇప్పుడు అదే తరహాలో ‘రథం’ సినిమా కూడా విడుదల కానుంది. రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘రథం’. నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ ఇలా అంతా కొత్తవాళ్లే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో గీత ఆనంద్, చాందిని హీరోహీరోయిన్లుగా నటించారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంభందించి ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ టీజర్, ‘పడిపో’ అనే పాట టీజర్‌ను విడుదల చేశారు.

అయితే కేవలం పోస్టర్లలో, టీజర్లలో దమ్ముంటే సరిపోదు కదా! సినిమాలో కూడా ‘ఆర్ఎక్స్100’లా కంటెంట్ ఉంటే కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. ఈ సాంగ్ కి youtube లో కూడా ఏవ్ కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది అడల్ట్ కంటెంట్ ఉందని విమర్శిస్తున్నారు. అర్జున్ రెడ్డి లో కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అయ్యింది, అడల్ట్ సన్నివేశాలు ఉన్నాయని కాదు అని కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://youtu.be/zN6VRBWQGdY