మహేష్‌ మహర్షి పై విమర్శలు కూడా..     2018-08-10   12:07:20  IST  Ramesh Palla

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. ఎంతగానో ఎదురు చూసిన ఈ చిత్రం టైటిల్‌పై క్లారిటీ వచ్చేసింది. ‘మహర్షి’ అంటూ ఈ చిత్రానికి టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇక ఫస్ట్‌లుక్‌ను మరియు టీజర్‌ను కూడా విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు పెంచేశారు. మహేష్‌బాబు లుక్‌పై ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫిదా అవుతున్నారు. అమ్మాయిలు కూడా మహేష్‌ లుక్‌కు కళ్లు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం స్థాయిని మరింతగా పెంచేలా మహేష్‌ టీజర్‌ ఉందని ఫ్యాన్స్‌ నుండి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Comments On Mahesh Babu Maharshi Movie-

Comments On Mahesh Babu Maharshi Movie

ఫ్యాన్స్‌ ఆహా, ఓహో అంటున్నారు. కాని కొందరు మాత్రం ట్రోలింగ్‌ చేసేస్తున్నారు. మహేష్‌బాబు ఫస్ట్‌లుక్‌ ఎప్పుడు చూసినా అలా నడిచి రావడంనే చూపిస్తున్నారు తప్ప, కాస్త విభిన్నంగా చూపించేందుకు మాత్రం ప్రయత్నం చేయడం లేదు అంటూ కొందరు అంటున్నారు. మహేష్‌బాబు లుక్‌ విషయంలో కూడా ట్రోలింగ్‌ జరుగుతుంది. గడ్డం ఎందుకు పెంచాడో అర్థం కావడం లేదని, స్టూడెంట్‌ లుక్‌కు గడ్డం లేకున్నా కూడా బాగానే ఉంటుందని, ఇక కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా కాస్త విమర్శలు వినిపిస్తున్నాయి.

మహేష్‌బాబు వేసుకున్న చెక్స్‌ షర్ట్‌ కంటే మరేదైనా డ్రస్‌ వేసుకుంటే బాగుండేది. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నుండి సాదారణ ప్రేక్షకులు కొత్తదనంను ఆశిస్తున్నారు. కొత్తదనం అంటే మీసాలు గడ్డం పెంచడం కాదని, డిఫరెంట్‌ లుక్‌ అంటున్నారు. పాత్రకు తగ్గట్లుగా మీసాలు పెంచితే పర్వాలేదు కాని, ఏదో ప్రత్యేకంగా కనిపించాలని, ఇది తనకు 25వ చిత్రం కనుక గడ్డంతో కనిపిస్తే ప్రత్యేకంగా ఉంటుందని మహేష్‌బాబు భావించినట్లుగా అనిపిస్తుందని కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Comments On Mahesh Babu Maharshi Movie-

ఎవరేం అనుకున్నా కూడా ‘మహర్షి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. మహేష్‌బాబుకు జోడీగా ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. అల్లరి నరేష్‌ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.