కలర్స్ స్వాతికి పెళ్లి ఖాయమైంది..! వరుడు ఎవరో తెలుసా.?     2018-08-14   08:28:03  IST  Sai Mallula

స్వాతి ఒక తెలుగు సినిమా నటి. ఈమె ‘కలర్స్’ అనే మా టీవి ప్రొగ్రామ్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించి తెలుగు ప్రజల మన్నలను అందుకుంది. స్వాతి 2008లో నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. ఈమె ముంబాయిలో పుట్టింది. ఎక్కువ కాలం రాజమండ్రిలో పెరిగింది.

అయితే ఎంతో క్యూట్ గా ఉండే స్వాతి. ఇటీవలే ఒక ఆడియో లాంచ్ లో తను దిగిన ఫోటోను ఫేస్బుక్ లో పెట్టింది. ఆ ఫోటో చుసిన అభిమానులంతా స్వాతి ఇలా అయిపొయింది ఏంటి అంటున్నారు. కొంతమంది అయితే ఆంటీ లా మారిపోయింది అంటున్నారు. మరికొంతమంది హెల్త్ ప్రాబ్లెమ్ ఏమో అంటున్నారు. ఒకసారి మీరే ఫోటో లుక్ వేసుకోండి!

Colours Swathi Marriage Details Revealed-

Colours Swathi Marriage Details Revealed

ఇది ఇలా ఉంటె…స్వాతికి సంబందించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ప్రముఖ సినీనటి స్వాతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొంతకాలంగా ఆమె వికాస్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇద్దరి కుటుంబాలకు చెందిన సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఆగస్ట్‌ 30న హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటల సమయంలో వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 2న కొచ్చిలో వివాహ విందును ఏర్పాటు చేయబోతున్నారట. వికాస్‌ మలేసియన్‌ ఎయిర్‌లైన్స్ లో పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వికాస్‌ స్వస్థలం ఇండోనేషియా రాజధాని జకార్తా. పెళ్ల‌య్యాక‌ స్వాతి అక్కడే స్థిరపడనున్నారు.