పాము బారి నుండి తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఈ కుక్క ఎలా ఫైట్ చేసిందో చూడండి...చివరికి...   Cobra Attacks Puppies, 4 Succumbed To Snakebite In Odisha's Bhadrak     2018-09-21   09:44:22  IST  Rajakumari K

ఈ సృష్టిలో వెలకట్టలేనిది ఏదన్నా ఉందా అంటే మాతృప్రేమ మాత్రమే అని ఘంటాపథంగా చెప్పొచ్చు.. పిల్లల ప్రాణాలకు ముప్పు అని తెలిస్తే కన్నతల్లి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి రక్షించాలనుకుంటుంది.. మనుషుల్లో మాత్రమే కాదు,జంతువులు కూడా ఈ మాతృప్రేమకు అర్హులే..కుక్క,పిల్లి,కోడి ఇలా దేన్నిగమనించినా వాటి పిల్లల జోలికి వస్తే ఊరుకోవు..పిల్లలను రక్షించుకోవడానికి శాయశక్తులా పోరాడతాయి..ఇదే విధంగా ఒక కుక్క తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఒక పాముతో ఫైటింగ్ కి దిగింది.. ఒడిషాలో జరిగిన ఈ ఘటన ,అందులో తల్లి కుక్క చూపిన సాహసం అందరిని ఆకట్టుకుంటుంది..ఇంతకీ ఏం జరిగిందంటే..

ఒక ఇంట్లో ఒక కుక్క ఏడుపిల్లల్ని పెట్టింది..వాటిని కంటికి రెప్పలా చూస్కుంటుంది.ఒక తెల్లవారుఝామున పాము రూపంలో శతృవు అక్కడికి వచ్చింది.ఆకలితో ఉన్న పాము పడగ విప్పి బుసలు కొడుతుంది..పాము బుస శబ్దానికి నిద్రలేచిన తల్లికుక్క ఎదురుగా ఉన్న పాముని చూసి మొదట షాక్ అయింది.కాని వెంటనే తేరుకుని శతృవు తన పిల్లల్ని చంపడానికి సిధ్దంగా ఉ:దని గుర్తించి ఎలా అయినా పిల్లల్ని రక్షించుకోవాలనుకుంది.ఓ వైపు పప్పీలపై పాము బుసకొడుతూ మీదకు వస్తోంది. చిన్న కుక్కపిల్లలు అరుస్తున్నాయి. మరోవైపు వాటిని కాపాడే ప్రయత్నంలో తల్లి కుక్క తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ విషసర్పాన్ని ఎదుర్కునేందుకు తల్లి కుక్క గట్టిగా ప్రయత్నించింది. ఎవరైనా సహాయం చేస్తారా అన్నట్టు గట్టిగామొరుగుతుంది..మరోవైపు ప్రాణాలకు తెగించి పాముపైకి దాడి చేసింది.ముందు తల్లి కుక్కను పక్కకు తొలగిస్తే ఆ తర్వాత పప్పీల పని పట్టొచ్చనుకుందో ఏమో ఈ నాగుపాము… తల్లి కుక్కపై దాడి చేసేందుకు ముందుకు వెళ్లింది. అప్పటికే రెండు చిన్న పప్పీలపై కాటు వేయడంతో ఆ కుక్క పిల్లలు చనిపోయాయి.

తెల్లవారుజాము కావడం ఓ వైపు పాము బుసలు మరోవైపు కుక్క మొరుగుతుండటంతో ఇంట్లో వారు నిద్రలేచారు. ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు కుక్క ఉన్న చోటికి వెళ్లారు. ఇంకే అక్కడ బారును ఉన్న పామును చూసి కాస్త భయపడ్డారు. వెంటనే స్థానికంగా ఉండే మహ్మద్ రఫి అని పాములు పట్టేవారిని పిలిపించారు. ఆయన వచ్చి పామును పట్టుకున్నాడు . అయినప్పటికీ ఆ పాము పగ చల్లారలేదు. ఎలాగైనా సరే కుక్కను చంపాలనే ప్రయత్నం తీవ్రంగా చేసింది. మహ్మద్ రఫి నుంచి ఆ పాము తప్పించుకునే ప్రయత్నం చేసింది. రఫి మాత్రం చాకచక్యంగా వ్యవహరించి మళ్లీ పట్టుకుని దాన్ని ఓ బాటిల్‌లో బంధించాడు. మొత్తానికి ఏడు కుక్కపిల్లల్లో రెండు మృతి చెందగా మరో ఐదు కుక్కపిల్లలు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాయి. కుక్క పాము మధ్య జరిగిన యుద్ధాన్ని ఇంట్లో వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.చూడ్డానికి సినిమాటిక్ గా ఉన్న వీడియో వైరల్ అయ్యింది.