గర్ల్ ఫ్రెండ్ తో గొడవపడి .. ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు... ఎంత ధర పలికిందో తెలుసా ..?   Clash With The Girlfriend? Trying To Buy Online     2018-10-09   18:15:35  IST  Sai M

గర్ల్ ఫ్రెండ్ తో గొడవపడితే ఎవరైనా ఏం చేస్తారు..? ఆమెతో మాట్లాడ్డం మానేస్తారు. కొన్నాళ్లపాటు దూరంగా ఉంటారు.. మరీ పెద్ద గొడవ అయితే ఆ లవ్ కి బ్రేకప్ చెప్పేస్తారు. కానీ ఏఈ ప్రేమికుడు మాత్రం నేను అందరిలా రొటీన్ గా చెయ్యను నేను ఏది చేసినా డిఫ్రెంట్ అంటూ… ఏకంగా గర్ల్‌ఫ్రెండ్‌నే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. ఈ విచిత్ర ఘటన యూకేలో జరిగింది. డేల్‌ లీక్స్‌ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ కెల్లీతో షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఇద్దరి మధ్య చిన్న గొడవైంది. దీంతో కోపంగా ఇంటికొచ్చేసిన డేల్‌ ఈబేలో కెల్లీ ఫొటోను అప్‌లోడ్‌ చేసి వేలానికి పెట్టాడు.

తన గర్ల్‌ఫ్రెండ్‌ను కారుతో పోలుస్తూ ఫొటో కింద వెరైటీగా వివరణ ఇచ్చాడు. ఇది కాస్త వైరల్‌గా మారి 24 గంటల్లోనే 81 వేల మందిని ఆకర్శించింది. వంద వరకు బిడ్లు నమోదయ్యాయి. ఆమె కోసం ఏకంగా రూ.68 లక్షలు ఇస్తానంటూ ఒకరు ముందుకొచ్చారు. ఆలస్యంగా గుర్తించిన ఈబే ఆ ప్రకటనను తొలగించింది. బాయ్‌ఫ్రెండ్‌ తనను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన విషయాన్ని తెలుసుకున్న కెల్లీ సరదాగా నవ్వుకుంది. కెల్లీని డ్రైవ్‌కు తీసుకెళ్తామంటూ అతడి ఫోన్‌కు పెద్ద సంఖ్యలో సందేశాలు వచ్చాయి.