కంటికి కనిపించని సినిమా వాళ్ళ కష్టాలు అంటూ ఓ సినిమా వ్యక్తి పంపిన మెసేజ్ ఇది.!  

సినిమా…సినిమా…సినిమా……
ఈ ట్రాన్స్ లో బతుకుతున్న మనుషులు చాలా మంది…కృష్ణానగర్ వీధుల్లో గడ్డలు,మీసాలు పెంచుకొని పిచ్చోళ్ళలా తిరుగుతున్న సినిమావాళ్ళు కోకొల్లలు…సినిమా వాడు పిచ్చోడే, ఆ పిచ్చె లేకపోతే సినిమా తీయడం కష్టం కదా…వీళ్ళకి వేరే పని చేయడం చేతకాదు…వేరేపని చేస్తే సినిమా మన నుండి ఎక్కడ దూరం ఐపోతుందోనన్న ఆందోళన…ఒక్కటి మాత్రం నిజం

గ్లిజరిన్ తో కారే కన్నీటి వెనుక సముద్రపు నీటిని దాచుకున్నంత దుఃఖం ఉంటుంది…

చేతిలో పని ఉండదు,జేబులో పది రూపాయలు ఉండవు,కడుపు కాలుతుంది,అయిన వాళ్ళ మైండ్ లో 100 కోట్లు కలెక్ట్ చేసే కథ కదులుతుంది,ఇది రా జీవితం అంటే అని అప్పుడు అనిపిస్తుంది…
వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చిన దొరకని excitement అది…

Cinema Kastalu A Story-

Cinema Kastalu A Story

ఒక జెండా ఎగురుతుంది అంటే అది కొన్ని వందలమంది సమాధుల మీద ఎగురుతుంది.
ఒక సినిమా మనకు కనిపిస్తుంది అంటే కొన్ని వేల మంది చెమట చుక్కలు చిందిస్తే దాన్ని మనం తెర మీద చూడగలుగుతున్నాం…

సినిమావాడు నిజంగా గ్రేట్ బాబాయి…
వాడు పాడే పాటని మనతో పాడిస్తాడు, వాడు చెప్పేమాటకి మనతో విజిల్ వేయిస్తాడు,వాడు వేసే స్టెప్పుని మనతో ఆడిస్తాడు,అబద్దం అని తెలిసినా మనల్ని నమ్మిస్తాడు,వాడు ఏడ్చి మనల్ని ఏడిపిస్తాడు, వాడిలో మనల్ని మనకు చూపిస్తాడు…

సినిమా అంటే చాలా మంది లైట్లు,కెమెరాలు,కార్లు,క్యారవాన్లు మాత్రమే అనుకుంటారు కానీ అది కాదు.

Cinema Kastalu A Story-

పొద్దున 6 గం..ల నుండి సాయంత్రం 6 గంటల వరకు 300 రూ..యాల కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు,లైట్స్ మెన్ లు లైట్లు మోస్తున్నపుడు పడే బాధలు,ఫైట్ మాస్టర్ దగ్గర ఫైటర్లకి తగిలే గాయాలు,హీరో డూప్ లకు విరిగిన ఎముకలు,డాన్సర్స్ కు జరిగే అవమానాలు,ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఉన్నదంతా అమ్మేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన ప్రొడ్యూసర్లు,సినిమాలో ఒక్క చిన్న వేషం కోసం 100 ల ఆఫీసులు తిరిగిన ఆర్టిస్టులు,సినిమాలో ఒక్క చిన్న డైలాగ్ ఉంటే బాగుండు అని ఆశతో ఎదురుచూసే హృదయాలు,ఎదో ఒక రోజు మనకంటు ఒక రోజు వస్తుందని ఎదురుచూసే అసిస్జెంట్ డైరెక్టర్లు,నా గురించి కాకపోయినా నేను రాసే మాటల కోసం జనం మాట్లాడుకునే రోజు ఒకటి వస్తుందని వెయ్యి కన్నులతో ఎదురుచూసే రైటర్లు….ఇంతమంది కలిస్తేనే ఓ సినిమా

సినిమా వాళ్ళు మనలా బద్ధకంగా ఉండరు..బాసూ…

రక్తంలో పేరుకుపోయిన పిరికి తనాన్ని వదిలేసి,గుండెల్లో రగులుతున్న జ్వాలని ఆశయంగా చేసుకొని,నరల్లో కలిసిపోయిన నీరసానికి నీళ్లు వదిలేసి,అనుకున్న దానికోసం ముందుకు దుంకేవాడే సినిమావాడు…

కన్నీటితో దాహాన్ని…కాఫిలతో కడుపుల్ని నింపుకోగల మనుషులు సినిమా వాళ్ళు…

రంగుల ప్రపంచం అంటాం,మన ప్రపంచాన్ని రంగుల్లోకి మార్చాలి అనుకుంటాం,కానీ కొందరికి మాత్రమే ఇక్కడ హరివిల్లు కనిపిస్తుంది..చాలా మందివి కాల రాత్రిలో కదులుతున్న బతుకులే…

10%మంది మాత్రమే మనకు సినిమాల్లో కనిపిస్తున్నారు,వినిపిస్తున్నారు…
మిగిలిన 90%మంది ఛాన్సులు రాక,వచ్చిన ఉపయోగం లేక,బతుకు చట్రంలో పడి కొట్టుకుంటున్న బతుకుని,బతకాలేక, బతకారాక,బతుకుతున్న బతుకులే ఈ సినిమా వాళ్ళ బతుకులు….
కొన్నిసార్లు ప్రశ్నలకు ప్రశ్నలే సమాదానాలు చెప్తాయి అంటే నమ్మలేదు.కానీ వీళ్ళని చూసాక నమ్మక తప్పడంలేదు…

వాళ్ల జీవితాలే ప్రశ్నలు, వాళ్ల సందేహాలే వాళ్లకి సమాధానాలు…

వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే నాకు ఆయాసం,మీకు అలసట రెండు వస్తాయి….

ఒక్క మాటలో చెప్పాలంటే…..
ముగింపు లేని సినిమాలాంటివి వీళ్ల జీవితాలు కళామాతల్లి కన్నా బిడ్డలు,కళనే నమ్ముకున్న కల్పవృక్షాలు…సినిమా కోసం కటిక పేదరికాన్ని కూడా జయించే సూపర్ హీరోలు… సినిమా వాళ్ళు….