అమితాబ్‌కు 3 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చిన చిరు.. కారణం ఏంటో తెలుసా..  

బాలీవుడ్‌, టాలీవుడ్‌ మెగాస్టార్స్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి 151వ చిత్రం అయిన సైరాలో బిగ్‌బి అమితాబ్‌ కీలకమైన గెస్ట్‌ రోల్‌ను పోషిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా అమితాబ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిన అమితాబ్‌ పారితోషికంగా ఒక్క రూపాయి కూడా వద్దు అంటూ ముందే చెప్పాడు. తన ట్రావెల్‌ అవెన్స్‌లు చూసుకుంటే చాలు అంటూ నిర్మాతకు సూచించాడు. పారితోషికం వద్దన్నంత మాత్రాన అమితాబ్‌ను ఉత్తి చేతులతో ఎలా పంపిస్తాం అనుకున్నాడో ఏమో కాని చిరంజీవి బాలీవుడ్‌ బిగ్‌బి కి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వడం జరిగింది.

Chiru's Expensive Gift To Amitabh-

Chiru's Expensive Gift To Amitabh

చిత్రీకరణ చివరి రోజున అమితాబచ్చన్‌కు దాదాపు మూడు కోట్ల విలువ చేసే ఖరీదైన బంగారు ఆభరణాలను కానుకలుగా ఇవ్వడం జరిగింది. ఈ బంగారు కానుకలను అమితాబచ్చన్‌ కాదనలేక పోయాడు. అభిమానంతో ఇస్తున్న కానుక అవ్వడంతో చిరంజీవిని చిన్నబుచ్చడం ఇష్టంలేక అమితాబ్‌ ఆ కానుకలను అయిష్టంగానే స్వీకరించినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరాలో అమితాబచ్చన్‌ నటించడంతో బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్‌ వచ్చింది. బాలీవుడ్‌లో ఈ చిత్రం దాదాపు 25 కోట్లకు అమ్ముడు పోయే అవకాశం ఉంది. దానికి కారణం ఖచ్చితంగా అమితాబచ్చన్‌. అందుకే ఇంత భారీ గిఫ్ట్‌ను చిరంజీవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Chiru's Expensive Gift To Amitabh-

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఉయ్యాలవాడగా చిరంజీవి నటిస్తుండగా, ఆయన గురువు పాత్రలో అమితాబచ్చన్‌ కనిపించబోతున్నాడు. విగ్గు పెట్టుకుని, గడ్డంతో నటించడం అంటే అమితాబ్‌కు చాలా చిరాకు. అయినా కూడా చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఈ చిత్రంకు ఓకే చెప్పాడు. ఆ అభిమానంతోనే పారితోషికం వద్దన్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్స్‌ పీక్స్‌లో ఉండేలా దర్శకుడు చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాత రామ్‌ చరణ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.