బాబు గాలి తీసేసిన ఆ సర్వే ..మోదీపై పోరాటాన్ని ప్రజలు నమ్మడంలేదా ..     2018-08-21   10:49:26  IST  Sai Mallula

ఎవరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా అసలు నిజం ఏంటో ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు ఉన్న ఇమేజ్ కాస్త తుస్ మంటుంది.
అలాగే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాలి పోగొట్టుకున్నారు. తమ ప్రకటనలతో బీజేపీ మీద తెగ యుద్ధం చేస్తున్నట్టు వారు ఇస్తున్న బిల్డప్ అంతా ఉత్తిదే అని తేలిపోయింది. తాజాగా ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై నిర్వహించిన సర్వేలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు పూర్తిగా వెనకబడిపోయారు.

Chandrababu Naidu Survey On Narendra Modi But No Useful-

Chandrababu Naidu Survey On Narendra Modi But No Useful

మోదీని ఎదుర్కునే ధీటైన నాయకుడు ఎవరు అంటే ఒక్కరికి కూడా టాప్ రేంజ్ మార్కులు వచ్చింది లేదు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలాంటి వాళ్ళు కనీసం పోటీలో అయినా నిలబడ్డారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో మోదికి సరైన ప్రత్యర్థి ఎవరు అని చెప్పి జాతీయస్థాయి సంస్థ ఇండియా టుడే చేసిన సర్వేలో కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ వెనకబడిపోయారు. నాలుగేళ్ళపాటు మోడీతో అంటకాగి అన్ని వ్యక్తిగత ప్రయోజనాలు పొందిన చంద్రబాబు, కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన టిడిపి నాయకులు కేవలం 2019 ఎన్నికల్లో ఓట్ల కోసమే మోదీతో విరోధం పెట్టుకున్నట్టుగా నటిస్తున్నారని, ఎన్నికలవగానే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తేలిపోయింది.

Chandrababu Naidu Survey On Narendra Modi But No Useful-

ఉత్తమ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీకి 13 శాతం మద్దతు జనం ఓటేశారు. ఆతర్వాతి స్థానంలో బీహర్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్, కేజ్రీవాల్ ఉన్నారు. వీరికి చెరో 10 శాతం మద్దతు లభించింది. మూడో స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. చంద్రబాబు ఏడు శాతం మద్దతుతో ఏడో స్థానంలో ఉండిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈ సర్వేలో నాలుగు శాతం మంది మాత్రమే ఉత్తమ ముఖ్యమంత్రిగా అభిప్రాయపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, పంజాబ్ సీఎం అమరేందర్‌ సింగ్‌కు కేవలం రెండు శాతం మేర మాత్రమే ప్రజల నుంచి ఉత్తమ సీఎంగా మద్దతు లభించింది