ఉంచలేరు .. తీయలేరు .. ఆ మంత్రులతో బాబు తిప్పలు     2018-08-21   13:49:57  IST  Sai Mallula

ఏపీ సీఎం చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా కొంతమంది విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అలుసుగా తీసుకుని వారు బాబునే లెక్కచేయకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎమ్యెల్యేల్లో కొంతమందికి మంత్రి పదవులు దక్కాయి. వారితో జగన్ ను ఒక ఆట ఆడించాలని, వైసీపీని బలహీనపరిచేలా జగన్ ను తిట్టించాలని బాబు ప్లాన్ వేసాడు. అయితే అది కాస్త వర్కవుట్ అవ్వడంలేదు. జగన్ ని తిట్టడం అటు ఉంచితే వారు బాబు మాటే లెక్క చేయని పరిస్థితి. అసలు వారిలో కొంతమంది ఉన్నా లేనట్టుగానే కనిపిస్తున్నారు.

Chandrababu Naidu MLAs Putting Him In To Confusion-

Chandrababu Naidu MLAs Putting Him In To Confusion

ఎన్నికలు దగ్గరకు వస్తుండడంతో చంద్రబాబు వీరి వ్యవహారంలో కఠినంగా వ్యవహరించలేకపోతున్నాడు. వీరి తీరుతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా, ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అయినా ఈ మంత్రుల వ్యవహారశైలి మాత్రం మారడంలేదు. పదహారు నెలల క్రితం చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. అందులో భాగంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. రాయలసీమ నుంచి ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్ నాథ్ రెడ్డి, ఉత్తరాంధ్ర నుంచి సుజయ కృష్ణ రంగారావులకు స్థానం కల్పించారు. వీరిలో వారికి కేటాయించిన శాఖల్లో చక్కగా పనిచేస్తుంది ఒక్క అమర్ నాధ్ రెడ్డి మాత్రమేనని టీడీపీ వర్గాలే చెప్తున్నాయి.

Chandrababu Naidu MLAs Putting Him In To Confusion-

వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి వారు చేసే విమర్శలతో జగన్ తో ఆడుకోవచ్చని బాబు ఆలోచన. అయితే వీరిలో జగన్ పై విమర్శలు చేసేది కేవలం ఆదినారాయణరెడ్డి మాత్రమే. మంత్రి సుజయకృష్ణ రంగారావు అయితే జగన్ పై ఏనాడూ విమర్శలు చేయలేదు. మంత్రి అఖిలప్రియ కూడా ఇంతే. ఇక శాఖాపరంగా చూసినా అమర్ నాధ్ రెడ్డి ఒక్కరే కొద్దిగా బెటరంటున్నారు. సచివాలయానికి రాకుండా, సమీక్షలు నిర్వహించకుండా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఉంటున్న మంత్రులు సుజయకృష్ణ రంగరావు, భూమా అఖిలప్రియలపై చంద్రబాబు అసహనం వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు మంత్రి పదవులు పొంది అటు పార్టీకి , ఇటు ప్రజలకు ఉపయోగపడడం లేదని బాబు తెగ బాధపడిపోతున్నాడు.