వారు పార్టీ ఫిరాయించారు .. అందుకే బాబు కూడా ఫిరాయించాడు     2018-09-01   11:25:24  IST  Sai Mallula

ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అనే సామెత కొంతమంది ఫిరాయింపు ఎమ్యెల్యేలకు బాగా వర్తిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్యెల్యేలుగా గెలిచినా.. ఆ తరువాత టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కొన్ని ప్రలోభాలతో కొంతమంది ఎమ్యెల్యేలు తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. అందులో కొంతమందికి స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పదవులు దక్కాయి. మరికొంతమందికి పదవి ఇస్తాము అనే ఆశ పెట్టి వెయిటింగ్ లో పెట్టారు. కానీ ఏపీలో రాజకీయ పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా లేకపోవడంతో వారికి మొండిచేయి చూపే పరిస్థితి వచ్చింది. దీంతో వారంతా లబోదిబో అంటూ చంద్రబాబు మీద గుర్రుగా ఉన్నారు.

Chandrababu Naidu Likely To Expand Cabinet-

Chandrababu Naidu Likely To Expand Cabinet

ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. చంద్రబాబు చెక్ పెట్టారు. తమను ఎమ్మెల్యేగా గెలిపించిన వైసీపీ ని వీడి అధికార పార్టీలోకి ఫిరాయించినందుకు వారు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించడానికి బాబు ముహూర్తం పెట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్ లో రెండు ఖాళీలున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలోనే మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తుండడంతో ఫిరాయింపు ఎమ్యెల్యేల ప్రస్తావన మళ్ళీ తెరమీదకు వచ్చింది.

Chandrababu Naidu Likely To Expand Cabinet-

టీడీపీలో ముస్లిం, గిరిజన వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ కోటాలో మంత్రి పదవులు దక్కించుకోవచ్చనే ఆశతో ఆ వర్గాలకు చెందిన కొందరు టీడీపీ లో చేరారు. నిజానికి కేబినెట్ లోనూ ఆ రెండు వర్గా ల వారికి మాత్రమే చోటు కల్పించాలనే బాబు కూడా ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్లేటు ఫిరాయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు పదవులు ఇచ్చేందుకు ఇష్టపడడంలేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఎన్నో ఆశలతో పార్టీ లో చేరిన వీరికి నిరాశే మిగిలేలా కనిపిస్తోంది.