చంద్రబాబు తప్పులు .. సోషల్ మీడియా తో తిప్పలు   Chandrababu Naidu Bothering About Social Media     2018-09-18   11:49:02  IST  Sai M

దేశంలో సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకి ఎక్కువైపోతోయింది. ప్రతి ఒక్కరి చేతిలోనూ నెట్ సౌకర్యం ఉన్న ఫోన్లు అందుబాటులోకి రావడంతో .. ఎక్కడైనా ఏడైనా జరిగితే క్షణాల్లో తెలిసిపోతోంది. ఒకప్పుడు రాజకీయాల గురించి తెలుసుకోవాలన్నా .. ఏ నాయకుడి పనితీరు ఎలా ఉంది అనేది అంచనా వేయాలన్న మీడియా ఛానెల్స్ మాత్రమే ఆధారం. వారు చుపించిందే జనం నమ్మేవారు.. వారి విశ్లేషణే ఆధారం చేసుకుని మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆ టీవీ ఛానెల్స్ కి ఆదరణ తగ్గిపోయింది. కారణం ఇప్పుడు ఉన్న అన్ని ఛానెల్స్ ఎదో ఒక పార్టీకి కొమ్ముకాయడం , వారికి అనుకూలంగా వార్తలు ప్రచారం చేయడంతో … అంతా ఇప్పడు సోషల్ మీడియా బాట పట్టారు. ముఖ్యంగా ఏపీ విషయాన్ని చూసుకుంటే.. రోజురోజుకీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త పెర‌గ‌డం… మెయిన్ స్ట్రీమ్ మీడియా బ‌య‌ట‌కు రానీయ‌కుండా తొక్కిపెట్టిన వార్త‌ల‌ను సోష‌ల్ మీడియా బ‌ట్ట‌బ‌య‌లు చేస్తుండం రాజకీయ పార్టీలకు మింగుడుపడంలేదు.

ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ పరిణామం అస్సలు మింగుడుపడడంలేదు. సోషల్ మీడియా పేరు చెప్తేనే బాబు లో వణుకు వచ్చేస్తుందని, అందుకే దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆయనకు ఎటువంటి ఇబ్బంది తగలకుండా పాలన చేయడానికి కారణం.. ప్రధాన మీడియా ఆయన కనుసన్నల్లో ఉండడమే కారణం. బాబు వ్యతిరేక వర్గం చేసే ఆందోళనలను తొక్కిపెడుతూ కేవలం అనుకూల వార్తలను మాత్రమే ప్రచారం చేస్తూ కొన్ని మీడియా ఛానెల్స్ ప్రజల విశ్వాసం కోల్పోయాయి.

ప్రజలు పడుతున్న అనేక ప్రధాన సమస్యలను వెలుగులోకి రాకుండా పరిపాలన అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టు ప్రధాన మీడియా కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు ఎవరు అండగా నిలబడ్డారు? ఎవరు వాటిని వెలుగులోకి తెచ్చి.. అంతో ఇంతో ప్రజలను మేల్కొలుపుతున్నారు? అంటే దీనికి వెంటనే వచ్చే సమాధానం సోషల్ మీడియానే. ఎక్కడ ఏమి జరిగినా తగిన ఆధారాలతో సహా సోషల్ మీడియా లో ప్రత్యక్షం అయిపోతున్నాయి.

Chandrababu Naidu Bothering About Social Media-

ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు అంతంత మాత్రం. కానీ, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు మాత్రం వందల కోట్లలోనే ఉంది. దీనిని వెలుగులోకి తెచ్చింది సోషల్ మీడియానే. పోలవరం ఆర్భాటాలను సచిత్రంగా కళ్లకు కట్టింది కూడా సోషల్ మీడియానే. ఇక, కాబోయే సీఎంగా పొగిడించుకుంటున్న ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఎప్పుడు నోరువిప్పినా.. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసేది తెలిసిందే. వీటిని కూడా ప్రముఖంగా ప్రచారం చేసేది చేసింది కూడా సోషల్ మీడియానే. ఈ విభాగంలో టీడీపీ ఎంత పాతుకుపోవాలని చూస్తున్నా అది వర్కవుట్ కావడంలేదు. ఒకవైపు చూస్తే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ఎలా అయినా సోషల్ మీడియాను కంట్రోల్ లో పెట్టే అవకాశాల కోసం బాబు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అది సాధ్యమయ్యే పనేనా ..?