ఈ డెలివరి బాయ్ చేసింది చూస్తే...ఇంకోసారి ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలంటే భయపడ్తారు.     2018-08-30   13:16:08  IST  Rajakumari K

ఒరేయ్ బాగా ఆకలేస్తుందిరా..జొమాటోలో ఆర్డర్ చేయనా స్నేహితుడి మాట .. చెల్లికి బిర్యాణి తినాలనుందటా..స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చా పావుగంటలో బిర్యాణి నీ కళ్లముందుంటుంది ఒక అన్న భరోసా..అమ్మా నాకు పిజ్జా తినాలనుంది.. జస్ట్ వెయిట్ కాలింగ్ పుడ్ పాండా… ఇలా పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రకంగా డెలీవరి సంస్థల ద్వారా ఫుడ్ బయట నుండి తెప్పించుకునే వారెందరో ..కానీ ఒక్కాసరి ఆలోచించండి..మీకు ఫుడ్ తెచ్చే డెలీవరీ బాయ్ కక్కుర్తి పడి ఆ ఫుడ్ తనే తినేస్తే ఎలా ఉంటుంది..తలచుకోవడానికే కష్టంగా ఉంది కదా..

Caught On Camera: Chinese Delivery Man Eats Customer's Meal-

Caught On Camera: Chinese Delivery Man Eats Customer's Meal

సోషల్ మీడియాలో ఇప్పుడు ఇలాంటి వీడియోనే వైరల్ అవుతోంది. ఓ డెలివరీ బాయ్ తీసుకొని వచ్చిన ప్యాకేజీని లిఫ్ట్ లో ఓపెన్ చేశాడు.అందులో సగం తినేశాడు..అదికూడా డైరెక్ట్ నోటితోనే…యాక్..అంతేకాదు సూప్ కూడా తాగేశాడు. తర్వాత అది తీసుకొని వెళ్లి కస్టమర్ కు అందించాడు.

Caught On Camera: Chinese Delivery Man Eats Customer's Meal-

అయితే ఇదేదో మన దేశంలో జరిగిందని డౌట్ పడకండి. ఇది జరిగింది చైనాలో..! కొందరు ఇదేంటి ఇలా డెలివరీ బాయ్స్ ఉంటారా అని అనుకుంటూ ఉంటే.. మరికొందరేమో అతడి మీద జాలి చూపిస్తున్నారు. ఎప్పుడు తిన్నాడో ఏమో అని..! అయినా మరీ ఎంగిలి చేసిన ఫుడ్ ను తీసుకొని వస్తే మాత్రం చాలా తప్పే…ఈ వీడియో చూస్తే ఇకపై ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలంటే మీరు కూడా క్షణం ఆలోచిస్తారు…చూడండి.. ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..