అధ్బుతం : బైక్ పై నుండి పడిపోయిన తల్లిదండ్రులు..బైక్ తో కొంతదూరం వెళ్లిపోయిన చిన్నారి..వీడియో చూస్తే షాక్ అవుతారు..  

బెంగళూరు హైవే పై వెళ్తున్న దంపతులు బైక్ పై స్పీడ్ గా వెళ్తూ ఎదురుగా ఉన్న స్కూటీని బలంగా ఢీకొన్నారు.దాంతో స్కూటిపై ఉన్న వ్యక్తితోపాటు బైక్ మీది నుంచి దంపతులిద్దరూ కింద పడిపోయారు. కానీ ముందు భాగంలో హ్యాండిల్ పట్టుకొని కూర్చున్న పాప అమూల్య మాత్రం అలాగే బైక్‌తోపాటు వెళ్లిపోయింది…. ఘోర రోడ్డు ప్రమాదం బారినుండి ఈ చిన్నారి సురక్షితంగా బయటపడిన వైనం చూస్తే అధ్బుతం అనుకోకుండా ఉండలేం…

Miraculous Escape For Child After Horrific Bike Mishap-

Miraculous Escape For Child After Horrific Bike Mishap

చన్నపరమేశ్వర్, రేణుక దంపతులు తమ ఐదేళ్ల చిన్నారితో కలసి బేగూరు నుంచి బెంగుళూరుకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ముందుగా వెళ్తున్న బైక్ ను చిన్నారి తండ్రి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులిద్దరూ బైక్ పై నుంచి కిందకు పడిపోయారు. కానీ, వారి బైక్ మాత్రం కిందపడలేదు. ముందు కూర్చున్న చిన్నారితో పాటు దాదాపు 300 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత వేగం తగ్గిన బైక్, రోడ్డుకు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొంది. దీంతో, ఆ చిన్నారి పక్కన ఉన్న గడ్డిలో పడి, సురక్షితంగా బయట పడింది. ఈ మొత్తం ఘటన వెనుకనే వస్తున్న ఓ కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఆదివారం సాయంత్రం బెంగుళూరు రూరల్ లోని నేలమంగళ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి.

Miraculous Escape For Child After Horrific Bike Mishap-

వెనక వస్తున్న కార్ డ్యాష్ బోర్డులో రికార్డు అయిన వీడియోను ఓ పోలీసు ట్విట్టర్ లో షేర్ చేయడంతో వైరలైన వీడియోను చూస్తున్న నెటిజన్లు ప్రమాదం నుండి బయటపడిన పాపను చూసి ఆశ్చర్యపోతున్నారు..బెంగళూరులో,సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ టాపిక్ గా మారిన ఈ వీడియోను మీరూ చూడండి…

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..