'వైసీపీ' లో కాపు ఓట్ల 'కుదింపు'..జనసేనాని ఎఫ్ఫెక్టేనా..?   Cast Votes Effects In Janasena About YS Jagan YCP     2018-09-22   11:02:50  IST  Bhanu C

ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం ,వైసీపీలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏకైక వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు..ఎందుకంటే ఏపీలో యువత మొదలుకొని ,తన సొంత సామాజిక వర్గం అయిన కాపులు ,అలాగే అభిమానులు ఇలా యువత, స్వచ్చంద సేవకులు , విద్యార్ధుల ఓటింగ్ దాదాపు జనసేన ఖాతాలోకే వెళ్తుంది అయితే ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన రూటు మార్చుకున్నారని తెలుస్తోంది..పవన్ ఏపీలో రోజు రోజుకి బలపడంతో జగన్ వ్యూహం మార్చుకున్నాడట ఇంతకీ ఏమిటా వ్యూహం అంటే.

వచ్చే ఎన్నికల్లో జనసేన వామపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేయనున్నాయి అయితే ఈ నేపధ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన సీట్లలో భారీ కోట విధించానున్నాడట జగన్..ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో తీవ్రమైన కలకలం రేపుతోంది..ఇదెక్కడి గొడవరా బాబు అంటూ కాపు నేతలు తలలు పట్టుకుంటున్నారట..నేపథ్యంలో ఆ సామాజికవర్గ ఇతర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ‘జగన్‌’ ప్రయత్నాలు చేయబోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాపు రిజర్వేషన్లు పరిధి కేంద్రంలో ఉందని తెలివిగా తప్పుకున్నారు.

]

2009లో ప్రజారాజ్యం పార్టీకి పోలైన ఓట్లను ఆయన పరిశీలించిన జగన్ ..ఇతర వర్గాలకు చెందిన ఓటర్లపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు..ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 2014లో ఓడిపోయిన అంబటి రాంబాబును తప్పించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారట..గుంటూరు జిల్లాలో గతంలో ‘రెడ్డి’ సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చామని..అయితే ఈసారి సమీకరణాలలో భాగంగా మరో రెండు సీట్లు అధికంగానే వారికి కేటాయించాలని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Cast Votes Effects In Janasena About YS Jagan YCP-

కాపు వర్గాలని దూరం పెట్టి బీసీ వర్గాలకి అధిక సీట్లు కేటాయించాలని జగన్ తీసుకున్న నిర్ణయంతో కాపు వర్గం నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు అయితే ‘అంబటి’ మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు..ఇదిలాఉంటే జగన్ మరో రకంగా కూడా తన అభిప్రాయాన్ని కీలక నేతల దగ్గర పంచుకున్నారట అదేంటంటే..నాలుగేళ్లలో ‘చంద్రబాబు’ కాపు కార్పొరేషన్‌కు భారీగా నిధులు ఇఛ్చారు.. అసెంబ్లీలో రిజర్వేషన్‌ కోసం బిల్లు పాస్‌ చేసి కేంద్రానికి పంపారు..కానే ఇప్పుడు కాపులు అందరూ పవన్ కి జై కొడుతున్నారు ఇలాంటి సమయంలో కాపులకి ఇప్పటివరకూ ఏమి చేయని మనం ఎలా వారిని ఆకట్టుకోవాలి అసలు వారు మనల్ని పట్టించుకోరని డిసైడ్ అయ్యారట..అందుకే కాపులకి కోత పెట్టి బీసీలని దగ్గర చేర్చుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడట..మరి ఈ నిర్ణయాలు ఎలాంటి ఫలితాలని ఇస్తాయో వేచి చూడాలిసిందే