రాఖీ కట్టిన చెల్లెళ్లకు ఆ అన్నయ్యలు ఇచ్చిన గొప్ప గిఫ్ట్..! ఏంటో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!     2018-09-02   08:52:45  IST  Sai Mallula

రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ..రాఖీ కట్టిన చెల్లెల్లకు మీకు రక్షగా మేమున్నాం అంటూ అన్నయ్యలు భరోసా ఇవ్వడమే కాకుండా చిన్న చిన్న గిఫ్ట్ లు కూడా ఇవ్వడం సాధారణం.ఈ సారి మన ఎంపీ కవిత రాఖీతో పాటు తోడబుట్టినవారికి హెల్మెట్ ఇవ్వాలనే ఆలోచన చాలా మంది ఫాలో అయ్యారు..అదే విదంగా రాఖీ కట్టిన చెళ్లెల్లకు బాత్రూంలు కట్టించి గిఫ్ట్ గా ఇచ్చారు అన్నయ్యలు..అదెక్కడో తెలుసుకోండి..

Brothers Gift Toilets To Sisters For Rakhi In Belagavi-

Brothers Gift Toilets To Sisters For Rakhi In Belagavi

గతంలో 8వ తరగతి విద్యార్థిని ఒకరు మరుగుదొడ్డి నిర్మించకుంటే పాఠశాలకు వెళ్ళేది లేదని భీష్మించుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా మరుగుదొడ్డి నిర్మించుకునే గర్భిణీలకు సీమంతాలు జరిపేలా జిల్లా పంచాయతీ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రాఖీపూర్ణియ సందర్భంగా 35 మరుగుదొడ్లు నిర్మించడంతో జిల్లా మరోసారి వార్త ల్లోకి ఎక్కింది.దేశ వ్యాప్తంగా రక్షాబంధన్‌ జరుపుకుంటున్న తరుణంలో బెళగావి జిల్లాలో ఓ చెల్లికి అన్న ఇచ్చిన బహుమతి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తోంది.ఇది ఆదర్శంగా తీసుకుని బెళగావి తాలూకా హుల్యానూరు గ్రామంలో 35 శౌచాలయాలను చెల్లెళ్ళకోసం వారి అన్నలు నిర్మించారు. జిల్లా పంచాయతీ సభ్యులతోపాటు గ్రామీణాభివృద్ధి అధికారులు ఇందుకు సహకరించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి బెళగావి జిల్లా ఏదో ఒకవిధంగా చర్చనీయాంశం అవుతూనే ఉంది…

Brothers Gift Toilets To Sisters For Rakhi In Belagavi-

దీనిద్వారా మనకు రెండు విషయాలు అర్దం అవుతున్నాయి.కనీస సౌకర్యాలు లేక స్త్రీలు ఇబ్బంది పడ్తున్నారనే విషయం ఒకటైతే..స్త్రీల పట్ల కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించే మగ అహంకారులు మాత్రమే కాదు వారి గురించి ఆలోచించేవారు ఉంటారని మరియు పండగ అనగానే ఖరీదైన గిఫ్ట్ ల స్ధానంలో వారికి ఉపయోగపడేవి ఇస్తే బాగుంటుందనే ఆలోచన నిజంగా ప్రశంసనీయం.