ఏడుస్తున్నాడని మూడేళ్ల చిన్నారిని,కుటుంబాన్ని విమానంలో నుండి దించేశారు.     2018-08-10   13:20:14  IST  Rajakumari K

విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు భయపడ్డాడో ,మరే కారణం చేతనో కానీ ఏడుపందుకున్నాడు మూడేళ్ల చిన్నారి.తల్లిదండ్రులు ఎంత సముదాయించినా ఆ చిన్నారి ఏడుపాపలేదు.పక్కనే ఉన్న విమాన సిబ్బంది బాబుని ఊరుకోబెట్టాల్సింది పోయి బెదిరించేసరికి మరింత బెదిరిపోయి గుక్కపెట్టి పెద్దగా ఏడ్చాడు.అంతే బాబుతో సహా కుటుంబాన్ని విమానంలోనుండి ఎయిర్పోర్ట్లో దించేసి వెళ్లిపోయారు విమాన సిబ్బంది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు..

British Airways Threw An Indian Family Out Of The Flight-

British Airways Threw An Indian Family Out Of The Flight

లండన్ నుంచి బెర్లిన్‌కు వెళుతున్న బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన విమానంలో (BA 8495) ఓ భారతీయ కుటుంబం కూడా ప్రయాణించింది.టేకాఫ్ అయ్యేముందు బాబుని సీట్లో కూర్చొబెట్టి సీట్ బెల్ట్ పెట్టింది తల్లి.దాంతో భయపడిన బాబు ఏడుపు అందుకున్నాడు.తల్లిదండ్రి ఎంత ఊరుకోపెట్టినా ఊరుకోలేదు.ఆ కుటుంబం వెనుక సీట్లలో కూర్చున్న మరో భారతీయ కుటుంబం ఆ బాబుని ఓదార్చడానికి ప్రయత్నించింది.అయినప్పటికి బాబు ఏడుపు ఆపలేదు.దీంతో విమాన సిబ్బందిలో ఒకరు “ఏడుపు ఆపుతావా లేదా,లేకపోతే కిటికిలోనుండి బయటకు తోసేస్తా ” అంటూ మాటలతో భయపెట్టేసరికి బాబు మరింత బెదిరిపోయాడు.దీంతో బాబు ఏడుపు ఆపట్లేదని ఆ విమాన సిబ్బంది ఆ కుటుంబం బోర్డింగ్ పాసులు తీసుకుని లండన్‌లో దించేశారు..

British Airways Threw An Indian Family Out Of The Flight-

ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తండ్రి పౌరవిమానయానాశాఖా మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాశాడు. విమానంలోని సిబ్బందిలో ఒకాయన తన కొడుకును దూషించాడని ఆ లేఖలో పేర్కొన్నాడు. వారి చర్యలకు తన కొడుకు బెదిరిపోయి మరింత గట్టిగా ఏడ్చాడని ,విమాన సిబ్బంది తమపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారని తెలిపాడు. తమకు జరిగిన అవమానంపై సీరియస్‌గా పరిగణించి ఆ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాబు తండ్రి లేఖలో సురేష్ ప్రభును కోరారు. అయితే ప్రయాణికుడితో తాము టచ్‌లో ఉన్నామన్న విమాన యాజమాన్యం.. జాత్యాహంకార వ్యాఖ్యలు చేసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని యాజమాన్యం స్పష్టం చేసింది.