బాబు ని ఇరికించే ప్రయత్నం జరుగుతోందా .. ఆ కేసులు బయటకి తీస్తున్నారా   BJP Master Plan On Chandrababu     2018-09-09   13:04:35  IST  Sai M

రాజకీల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. రాజకీయాల్లో తమ అవసరాలు ఉన్నంతవరకే… ఎవరితో అయినా కలవడం విడిపోవడం అనేవి ప్రధానంగా ఉంటాయి. గతంలో రాజకీయ అవసరాల నిమిత్తం కలిసిన బీజేపీ- టీడీపీ నాలుగేళ్లపాటు కలిసిమెలసి ఉన్నాయి. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ఇప్పడు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా .. ఎప్పుడో కేసులను బూచిగా చూపించి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ని ఇరికించి రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచనలో మోదీ అండ్ కో బృందం ఉంది. అందుకే ఎప్పుడెప్పుడా ఉన్న పాత కేసులు అన్నిటిని బయటకి తీసి ఇప్పడు ఆయన్ని ఇరికించాలని చూస్తోంది. ఓటుకు నోటు అంశంతో పాటు ఏపీలో నిర్మాణంలో ఉన్న అనేక ప్రాజెక్టులకు సంబంధించి అవకతవకలు కేంద్రం గుర్తించి ఆ వివరాలతో చంద్రబాబు ని ఆదుకోవాలని చూస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ది కూడా దాదాపు అలాంటి పరిస్థితే.. కాంగ్రెస్‌ హయాంలో.. ఒకప్పుడు కార్మిక మంత్రిగా చేసి.. వెలగబెట్టిన ఘనకార్యాన్ని మోడీ.. ప్రధాని కాగానే బయటకు తీశారు. ఓ ఫైన్ మార్నింగ్‌ సీఎం క్యాంపాఫీస్‌కు అధికారుల్ని పంపించి నట్లు బిగించారు. ఆ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. కానీ అప్పట్నుంచి కేసీఆర్ తీరే మారిపోయింది. బీజేపీ చేతిలో కీలబొమ్మ అయిపోయారు. ఇక ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే.

BJP Master Plan On Chandrababu-

ఇంకో విషయం ఏంటంటే.. కేసీఆర్ , జగన్, పవన్ ఇలా అందరూ మోదీ కి సరెండర్ అయిపోయారు. పైకి వారు మోదీని ఎన్ని మాటలు అన్న లోపల మాత్రం మోదీ చెప్పిందే వారికి వేదం. కానీ చంద్రబాబు మాత్రం మోదీ బెదిరింపులకు లొంగలేదు. అందుకే ఎప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచే సీబీఐ పేరుతో బెదిరింపులు ప్రారంభించారు. పట్టిసీమ, పీడీ అకౌంట్లు , ఉపాధి హామీ నిధులు , పోలవరం, శ్రీవారి నగలు ఇలా ఎందులో దొరికితే అందులో బాబు ని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. పట్టిసీమ కాంట్రాక్టర్ కు జాతీయ స్థాయిలో కొన్ని కాంట్రాక్టులిచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ మీద ఇప్పటికే సంతకాలు తీసుకున్నారని ఇక బాబు ని ఒక ఆట ఆదుకుంటారని ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఎదో ఒక రకంగా టీడీపీ అధినేతను ఇరికించి రాజకీయ కక్ష తీర్చుకునే ఆలోచనలో బీజేపీ ఉంది.