కౌశల్ పై ఫైర్ అయిన తనీష్..! కౌశల్ కామెంట్స్ దెబ్బకి హౌస్ మేట్స్ కి దిమ్మతిరిగింది.!   Bigg Boss2 Telugu Tanish Fires On Kaushal     2018-09-18   10:39:26  IST  Sainath G

బిగ్ బాస్ హౌస్‌లో వీకెండ్ వస్తే.. శనివారం నాడు హాట్ హాట్ డిస్కషన్స్‌లో రంజుగా సాగుతుంది. నాని హోస్ట్‌గా హెడ్ మాస్టర్ అవతారంలో ఒక్కో కంటెస్టెంట్‌‌కి మొట్టికాయలేస్తున్న నాని ఆదివారం నాటి 99వ ఎపిసోడ్‌లో ‘నీ మంచికోరి’ అనే సరదా సరదా టాస్క్‌లో ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఈ టాస్క్‌లో భాగంగా తమ తోటి కంటెస్టెంట్‌లో ఉన్న ఏదైతే నెగిటివ్ క్వాలిటీ ఉందో దాన్ని తొలిగించుకుంటే బావుంటుందని భావిస్తారో అలాంటి నెగిటివ్ పదాలు ఆరింటిని సూచించాలని.. ఆ సందర్భంలో కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు నాని.

ఇది ఇలా ఉండగా…బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే…కౌశల్ అనే పేరు మనకి వినిపిస్తుంది. కౌశల్ ఆర్మీ నే దీనికి సాక్ష్యం. అలాంటిది ఇటీవల ఎపిసోడ్ లో కౌశల్ పై ఫైర్ అయ్యారు నాని. ఈ విషయంపై సోమవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్, కౌశల్ మధ్య చర్చలు జరిగాయి. ముందుగా కౌశల్.. ”నాని గారంటే గౌరవం కాబట్టి ఆయనేం అన్నా నేను మాట్లాడలేదు” అంటూ హౌస్ మేట్స్ తో కౌశల్ అనగా.. హౌస్ మేట్స్ అందరూఒక్కటై కౌశల్ ని టార్గెట్ చేశారు.

Bigg Boss2 Telugu Tanish Fires On Kaushal-

”అంటే మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారా..?” అంటూ రోల్ రైడా ప్రశ్నించగా.. ”బిగ్ బాస్ రూల్స్ నేను ఫాలో అయ్యాను..” అంటూ చెప్పే ప్రయత్నం చేయగా.. సీన్ లో తనీష్ ఎంటర్ అయ్యి.. ”మీరు ఫాలో అవ్వలేదని నాని చెప్పారు. సంచాలకుడుగా మీరు డిజాస్టర్ అని కూడా అన్నారని” చెప్పగా.. ”సంచాలకుడిగా నా గేమ్ నేను ఆడుతున్నానని” కౌశల్ అన్నాడు.

దీనికి వెంటనే తనీష్.. ”అది మేటర్.. సంచాలకుడిగా ఆయన ఆడిన గేమ్ అది” అని వ్యంగ్యంగా మాట్లాడారు. నేను తప్పు చేస్తే శిక్షకు సిద్ధమని కౌశల్ అన్న మాటకి తనీష్ మరోసారి అతడిపై ఫైర్ అయ్యాడు. గతంలో తను అదే స్టేట్మెంట్ ఇస్తే.. అంగీకరించని కౌశల్ ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించగా ”ఆయన చేస్తే కరెక్ట్ మనం చేస్తే రాంగ్ అంటూ” గీతా.. తనీష్ కి తన సపోర్ట్ అందించింది. వీరి మధ్య చర్చలు చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగుతుందనిపిస్తుంది.