బిగ్ బాస్ ఎపిసోడ్ టీవీలో రాకముందే...ఎలిమినేషన్ ఎవరో లీక్ అయ్యింది...ఎలాగో తెలుసా.     2018-08-27   09:54:13  IST  Sai Mallula

నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రెండో సీజన్ దాదాపు చివరి దశకు చేరుకుంది. సీజన్‌లో మరోసారి ఎలిమినేషన్ వార్త లీకైంది. ఈ వారం ఎలిమినేషన్‌ కోసం నామినేషన్స్‌లో కౌశల్, తనీశ్, దీప్తి నల్లమోతు, పూజా రామచంద్రన్ ఉండగా.. వీరిలో ఒక్కరు ఈరోజు హౌస్‌ని వీడనున్నారు. అయితే ఆ ఒక్కరు ఎవరో ఎపిసోడ్ ప్రసారంకాక ముందే సోషల్ మీడియాలో లీకైంది. లీక్ అవ్వకపోయిన సింపుల్ గా గెస్ చేసేలా ఎపిసోడ్స్ ఉండటంతో ఈ వార్తపై నెటిజెన్లు ట్రోల్ల్స్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 2 Elimination Details Leaked: Pooja Ramachandran-

Bigg Boss Telugu 2 Elimination Details Leaked: Pooja Ramachandran

ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ హీరో కౌశల్ ఎలిమినేట్ అయ్యే ప్రశక్తే లేదు. అతను ఎలిమినేట్ అయితే షో ఎవరు చూడరు అని తెలిసిందే కదా. ఇక తనీష్ కి కూడా మంచి ఫోలివింగ్ ఉంది. అతను కూడా ఎలిమినేట్ ఎవ్వడు. మిగిలింది దీప్తి, పూజ.
ఇద్దరు కంటెస్టెంట్స్‌లో దీప్తి నల్లమోత ఈవారం కెప్టెన్‌ కావడంతో ఆమె సేవ్ అయ్యే ఛాన్స్‌లు మెండుగా ఉన్నాయి. అయితే.. హౌస్‌లో రూల్స్‌ని సరిగ్గా పాటించకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి దీప్తిని శుక్రవారం బిగ్‌బాస్ తొలగించాడు. కానీ.. ఆ ఎపిసోడ్ శనివారం ప్రసారం కావడంతో ఆమెపై ఓటింగ్ ప్రభావం పడకపోవచ్చు. ఎందుకంటే శుక్రవారం అర్ధరాత్రి వరకే ఓటింగ్‌ టైమ్‌ ఉంటుంది. ఇక నామినేషన్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌ పూజా రామచంద్రన్.

Bigg Boss Telugu 2 Elimination Details Leaked: Pooja Ramachandran-

బిగ్‌బాస్ హౌస్‌లోకి 43వ రోజు వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ తొలి వారంలో చాలా ఉత్సాహంగా కనిపించింది. కానీ.. ఆ తర్వాత హౌస్‌లో ఆమె చురుకుదనం తగ్గిపోయిందని శనివారం రాత్రి నానీనే పెదవి విరిచాడు. టాస్క్‌లో సహనం కోల్పోవడం, హౌస్‌లో ప్రతిసారీ పెద్దగా గొడవలకి దిగడం పూజా అలవాటుగా చేసుకుంది. దీంతో.. ఈరోజు పూజా రామచంద్రన్ ఎలిమినేట్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ ఎపిసోడ్ టీవీలో రాకముందే…ఎలిమినేషన్ ఎవరో లీక్ అయ్యింది..కోసం క్లిక్ చేయండి..