పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీకి అమెరికా భారీ జరిమానా.   Big Penalty On People Tech Group Company For Miss Using Hb-1 Approval     2018-09-15   12:28:25  IST  Bhanu C

రెండ్మెండ్ కేంద్రంగా పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీ ఐటీ కార్యకలాపాలు చేస్తోంది ఈ కంపెనీకి వివిధ దేశాలలో ఆఫీసులు కూడా ఉన్నాయి..దాదాపు మూడు దేశాల్లో కలిపి 10 ఆఫీసులు వరకూ ఈ సంస్థకి ఉన్నాయి..ఇండియాలో హైదరాబాద్ ,అధోని ,బెంగుళూరు లలో కూడా ఆఫీసులు కలవు అయితే ఈ కంపెనీ లో పని చేస్తున్న ఉద్యోగులకి సరైన జీతాలు ఇవ్వని కారణంగా ఈ సంస్థకి అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది..

రెండ్మెండ్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలోని తన ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ జీతం ఇస్తున్నారని లేబర్ వేజ్ అండ్ హవర్ డివిజన్ విభాగం గుర్తించడంతో 12 మంది హెచ్‌ 1 బీ ఉద్యోగులకు మూడు లక్షల డాలర్లను ఇవ్వాలని ఆ కంపెనీని ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు 45 వేల డాలర్ల ఫైన్‌ విధించింది. అయితే హెచ్ 1బి వీసాలను ఐటీ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.

Big Penalty On People Tech Group Company For Miss Using Hb-1 Approval-

అయితే ఈ కంపెనీ హెచ్ 1 బి కంప్యూటర్ అనలిస్టులు, కంప్యూటర్ ప్రొగ్రామర్స్ గా పనిచేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎంట్రీ లెవల్ జీతాలు ఇస్తున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు…ఎంతో అనుభవం ఉన్న ఈ ఉద్యోగులుకు భారీ జీతాలు ఇవ్వాల్సి ఉండగా కంపెనీ తక్కువ జీతంతో పనిచేయిస్తున్నారని అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో మిగిలిన కంపెనీలు అలెర్ట్ అవుతాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.