ఇంట్లో ,ఆఫీస్లో వినాయక విగ్రహం పెట్టేటప్పుడు పాఠించాల్సిన నియమాలు...   Best Location To Place Lord Ganesha Idol In Home Or Office     2018-09-10   11:20:14  IST  Rajakumari K

వినాయకుడి విగ్రహాన్ని చాలా మంది భక్తులు తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు. కాకపొతే చాలా మందికి ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి గణేశుడి విగ్రహాన్ని పెడితే ధనంతో పాటు, ఆనందం విజయం ప్రాప్తిస్తాయి అనే విషయాలు పెద్దగా తెలియవు.మీకు గనుక ఏ ఏ ప్రదేశాల్లో విగ్నేశ్వరుడి విగ్రహం పెట్టాలని తెలియకపోతే, వాస్తు ఆధారంగా క్రింద చెప్పబడిన సూచనలను తప్పక పాటించి ఆయా ప్రదేశాల్లో విగ్రహాన్ని పెట్టి సకల సౌభాగ్యాలను పొందండి..

· ఎవరైతే ఆనందాన్ని, శాంతిని మరియు సిరిసంపదలను కోరుకుంటారో అలాంటి వ్యక్తులు తెల్ల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలి. తెల్ల వినాయకుడి చిత్రాన్ని తప్పక ఇంట్లో పెట్టుకోవాలి.

· ఎవరైతే స్వీయ అభివృద్ధి కోరుకుంటారో, అటువంటి వ్యక్తులు సిందూర వర్ణము వినాయకుడిని ఇంటికి తెచ్చుకొని ప్రతి రోజు పూజించాలి.

Best Location To Place Lord Ganesha Idol In Home Or Office-

· ఇంట్లో పూజించుకోవడానికి కూర్చొని ఉన్న గణేషుడిని తెచ్చుకుంటే చాలా మంచిది. కూర్చున్న వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అదృష్టం మరియు విజయాలు మన జీవితంలో తిష్ట వేస్తాయి.

Best Location To Place Lord Ganesha Idol In Home Or Office-

· కూర్చొని ఉన్న వినాయకుడి తొండం ఎడమ వైపుకి వంగి ఉన్న విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకోవాలి. ఏ గణేశుని విగ్రహానికైతే తొండం కుడి వైపుకి వంగి ఉంటుందో ఆ విగ్రహం పెట్టుకుంటే, వినాయకుడి అనుగ్రహం పొందడం కష్టమవుతుంది.

Best Location To Place Lord Ganesha Idol In Home Or Office-

· మీరు గనుక విగ్నేశ్వరుడు విగ్రహాన్ని పని చేస్తున్న దగ్గర పెట్టుకోదలిస్తే, నిలుచుని ఉన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలనే విషయాన్ని మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం ద్వారా మీరు చేస్తున్న పనికి శక్తితో పాటు ఉత్సాహం తోడవుతుంది.

Best Location To Place Lord Ganesha Idol In Home Or Office-

· ఎలుకతో పాటు, ఉండ్రాళ్లు కలిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకుంటే… అది మీకెంతో పవిత్రతను చేకూరుస్తుంది.

Best Location To Place Lord Ganesha Idol In Home Or Office-

· మీ పూజ గదిలో వినాయాక స్వామి విగ్రహాన్ని ఒక్కటి మాత్రమే పెట్టుకోండి. ఒకటి కంటే ఎక్కువ గనుక పెట్టుకున్నట్లైతే, విగ్నేశ్వరుడి భార్యలు రిద్ధి, సిద్ది నిరుత్సాహ పడతారు .

Best Location To Place Lord Ganesha Idol In Home Or Office-

· గణేశునికి గడ్డి ని సమర్పించడం మాత్రం భక్తులు మర్చిపోకూడదు. గడ్డిని సమర్పించిన తర్వాత భక్తులు ఈ గణపతి మంత్రాన్ని తప్పక పఠించాలి. ” ఓం గమ్ గణపతయే నమః “

Best Location To Place Lord Ganesha Idol In Home Or Office-

· స్వస్తిక్ చిహ్నం వినాయక స్వామిదని చాలా మంది నమ్ముతారు. అందు చేత ఎవరైతే వాస్తుదోషం తో బాధపడుతుంటారో అటువంటి వ్యక్తులు ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.