ఇన్నాళ్లకు కళ్లు తెరచిన బెల్లంకొండ.. ఇకపై అసలు పరీక్ష  

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తన కొడుకు శ్రీనివాస్‌ను భారీ ఎత్తున పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో మొదటి సినిమా ‘అల్లుడు శీను’కే ఏకంగా 40 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఆ చిత్రం విజయాన్ని దక్కించుకున్నా కూడా కొత్త హీరో అవ్వడంతో సగం కలెక్షన్స్‌ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌ భారీ బడ్జెట్‌తోనే చేస్తూ వచ్చాడు. తాజాగా వచ్చిన ‘సాక్ష్య’ చిత్రం వరకు అన్ని కూడా 40 కోట్ల బడ్జెట్‌తోనే తెరకెక్కినవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Bellamkonda Suresh Wants Low Budget For His Next Movie-

Bellamkonda Suresh Wants Low Budget For His Next Movie

‘సాక్ష్యం’ చిత్రంకు మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి. మొదటి వారంలో పది కోట్ల షేర్‌ దక్కించుకుంది. స్టార్‌ హీరో మూవీ అయితే ఆ కలెక్షన్స్‌ కంటిన్యూ అయ్యేవి. కాని చిన్న హీరో అవ్వడంతో పది కోట్ల వద్దే కలెక్షన్స్‌ ఆగిపోయాయి. సాక్ష్యం వల్ల దాదాపుగా 25 కోట్ల మేరకు నిర్మాతకు నష్టం అంటూ సమాచారం అందుతుంది. బెల్లంకొండ స్థాయి మేరకు 20 నుండి 25 కోట్ల మేరకు బడ్జెట్‌ పెడితే రికవరీ చేయగలరు అని వెళ్లడైంది. అందుకే ఇకపై బెల్లంకొండతో సినిమాలు చేయబోతున్న నిర్మాతలు కాస్త జాగ్రత్తపడి సినిమాలు నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు.

భారీ స్థాయిలో బడ్జెట్‌ పెట్టడం వల్ల ప్రతి సినిమాకు నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఇకపై తక్కువ బడ్జెట్‌ చిత్రాల్లో నటించాలని ఆయన భావిస్తున్నాడు. ఈ నిర్ణయంపై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా బెల్లంకొండ ఈ నిర్ణయం వల్ల ఎక్కువ సినిమాల ఆఫర్లు దక్కించుకోవడంతో పాటు, మంచి ఫలితాలను దక్కించుకుంటాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Bellamkonda Suresh Wants Low Budget For His Next Movie-

చిన్న బడ్జెట్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో కాస్త చిన్న చూపు ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే చిన్న బడ్జెట్‌తో సినిమా చేస్తే పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు అసలు విషయం. బెల్లంకొండ శ్రీనివాస్‌ చిన్న బడ్జెట్‌తో సినిమాను చేస్తే ప్రేక్షకులు ఆధరిస్తారా, మునుపటి చిత్రాల మాదిరిగా మంచి కలెక్షన్స్‌ను ఇస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంను బెల్లంకొండ శ్రీనివాస్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తేజ దర్శకత్వంలో మూవీని 25 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు.