అరవింద సమేత కోసం బాబాయిని ఆహ్వానించిన ఎన్టీఆర్‌.. బాలయ్య సమాధానం ఇదే!!   Balakrishna Is The Chief Guest For Aravinda Sametha Audio Launch     2018-09-08   08:47:09  IST  Ramesh P

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆడియో విడుదల కార్యక్రమంను సెప్టెంబర్‌ 20న భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మిగిలి ఉన్న టాకీ పార్ట్‌ను పూర్తి చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో బాలకృష్ణ హాజరు అవుతాడు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మరో ఆసక్తికరమైన పుకారు సోషల్‌ మీడియాలో షికారు చేస్తోంది.

హరికృష్ణ మరణంతో చాలా కాలంగా కోపతాపాలతో ఉన్న బాబాయి, అబ్బాయిలు కలిసి పోయారు. ఇటీవలే ఎన్టీఆర్‌తో బాలకృష్ణ మాట్లాడటం మనం చూశాం. అందుకే బాలకృష్ణ ‘అరవింద సమేత’ ఆడియో వేడుకకు హాజరు అవుతాడు అంటూ నందమూరి అభిమానులు భావిస్తున్నారు. బాలకృష్ణ చాలా కాలంగా ఎన్టీఆర్‌ను దూరం పెట్టాలని ప్రయత్నిస్తూ వస్తున్నాడని, ఇప్పుడు తండ్రి చనిపోయిన ఎన్టీఆర్‌ను దగ్గరకు తీసుకోవాలని బాబాయి భావిస్తున్నాడు. అందుకే ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో హాజరు అయ్యి తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్‌కు స్టేజ్‌పైనే నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పే అవకాశం ఉంది.

Balakrishna Is The Chief Guest For Aravinda Sametha Audio Launch-

ఇటీవల ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎన్టీఆర్‌ స్వయంగా వెల్లి బాబాయి బాలయ్యను కోరినట్లుగా ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. అందుకు బాలయ్య కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని, ఈనెల 20వ తారీకున బాలయ్య సూచన మేరకే ఆడియో విడుదల తేదీని ఖరార చేసినట్లుగా నందమూరి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఒకే వేదికపై ఎన్టీఆర్‌ మరియు బాలకృష్ణలను చూసి ఫ్యాన్స్‌ చాలా కాలం అయ్యింది. ఆ ముచ్చట ఇన్నాళ్లకు తీరబోతుందని సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అరవింద సమేత చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఇది కేవలం ఫ్యాన్స్‌ సృష్టించిన పుకార్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో ఇద్దరు కూడా ఒకేస్టేజ్‌ను షేర్‌ చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల అంటున్నారు.