బాబాయి, అబ్బాయి కలయిక.. కంటతడి పెట్టుకున్న అభిమానులు  

నందమూరి అభిమానులకు తీరని లోటును మిగిల్చి హరికృష్ణ కన్నుమూసిన విషయం తెల్సిందే. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, ఫ్యాన్స్‌కు కూడా తీవ్ర శోకంను మిగిల్చారు. ఈ సమయంలో నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలన్ని పక్కకు తొలగి పోయాయి. గత కొంత కాలంగా హరికృష్ణ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలు మరణం తర్వాత కలిసి పోయారు. హరికృష్ణ పాడెను చంద్రబాబు మోయడంతో పాటు, అన్ని కార్యక్రమాలను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసుకోవడం కూడా నందమూరి ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించింది.

హరికృష్ణ చనిపోయిన మూడవ రోజున కుటుంబ సభ్యులు నిర్వహించిన చిన్న కార్యంలో మరో అదురైన కలయిక జరిగింది. బాలకృష్ణ, ఎన్టీఆర్‌ల కలయిక చనిపోయిన రోజు మాత్రమే అని, ఏదో మొక్కుబడిగా బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు కలిసి పోయారు తప్ప ఇద్దరి మద్య ఎప్పటికి ఆ కోల్డ్‌ వార్‌ ఉంటూనే ఉంటుందని ఫ్యాన్స్‌ అభిప్రాయ పడ్డారు. కాని వారి అంచనా తారుమారు చేస్తూ తాజాగా జరిగిన చిన్న కార్యంలో ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌లతో బాలకృష్ణ చాలా సమయం మాట్లాడటం, వారిమద్య అన్యోన్యం పెరిగినట్లుగా అనిపించింది.

Balakrishna Having Launch With Jr Ntr And Kalyanram At Harikrishna House-

Balakrishna Having Launch With Jr Ntr And Kalyanram At Harikrishna House

చాలా కాలంగా ఎదురు చూస్తున్న కలయిక సాకారం కావడంతో నందమూరి అభిమానుల కళ్లలో నీళ్తు తిరుగుతున్నాయి. ఒక చిన్న వీడియో నందమూరి అభిమానుల ఆనందంకు అవదులు లేకుండా చేస్తుంది. కార్యం ముగిసిన తర్వాత బోజనం చేస్తున్న ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ల వద్దకు వెళ్లిన బాలకృష్ణ చాలా సమయం ఏదో ముఖ్యమైన విషయాన్ని మాట్లాడటం, అందుకు ఎన్టీఆర్‌ సమాధానం ఇస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దాంతో బాబాయి, అబ్బాయి కలిసి పోయినట్లే అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

చాలా సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలు ఎన్టీఆర్‌ను దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్టీఆర్‌ను తెలుగు దేశం పార్టీకి పెట్టాలనే ఉద్దేశ్యంతో వారు అలా చేస్తున్నారు అంటూ కొందరు చెబుతూ వస్తున్నారు. తాజాగా విభేదాలు తొలగిపోవడంతో బాబాయి, అబ్బాయిలు ఒకరి సినిమా వేడుకలకు మరొకరు వెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఏం జరిగినా అంతా మన మంచికే అంటూ ఉంటారు. హరికృష్ణ చనిపోవడం దురదృష్టకరం అయినా కూడా ఆ మరణం ఎన్టీఆర్‌, బాలకృష్ణలను కలిపిందని ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి