ఫోటో:ఇన్ని సూదులు వాడితే పుట్టాడు..నెట్లో వైరలవుతున్న ఫోటో వెనుక కథ ఇదీ..     2018-08-22   12:00:28  IST  Rajakumari K

హృదయాకారంలో చుట్టూ వేల కొద్దీ సూదులు… మధ్యలో అమాయకంగా నిద్రపోతున్న బేబీ…ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఒక ఫోటో నెటిజన్ల గుండెల్ని పిండేస్తుంది.. హార్ట్ సింబల్ లా సిరంజీలను చుట్టూ అమర్చి తీసిన ఫొటో చూసిన ప్రతి ఒక్కరికి ఆ బేబీకి, హార్ట్ సింబల్ కు, సిరంజీలకు ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలనే ఆసక్తి పెంచుతుంది..

Baby London Was Wrapped In A Rainbow Blanket And With 1616 Needles-

Baby London Was Wrapped In A Rainbow Blanket And With 1616 Needles

పాట్రీసియా నీల్, కింబెర్లీ అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. తమకు ఓ బిడ్డ కావాలని ఐయూఐ (ఇంట్రా యూటిరైన్ ఇన్‌సెమినేషన్) పద్ధతిని ఎంచుకున్నారు. ఇది కూడా సరోగసీ వంటి ఓ పద్ధతే. అది ఫెయిల్ కావడంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు. ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది.

Baby London Was Wrapped In A Rainbow Blanket And With 1616 Needles-

దాదాపు నాలుగేళ్ల తరువాత వారి ప్రయత్నం ఫలించగా, పాట్రీసియా నెల తప్పింది. కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు తేల్చగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసి, ఈ బిడ్డను కంది. ఆపై ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను ఇలా పేర్చి, మధ్యలో తమ బిడ్డను ఉంచి ఈ ఫొటో తీసి సోషల్ మీడియాలో పంచుకుందీ జంట. 1,616 సిరంజీలను వాడి వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారని, తాను తల్లి కావాలన్న కోరిక తీరిందని ఆనందంగా చెప్పింది పాట్రీసియా. అదీ సంగతి.