'బాబ్లీ'...నోటీసులు బాబు... 'స్కెచ్చే'..!   Babli Case Reopens On Chandrababu Naidu     2018-09-15   12:02:59  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజకీయ ఉద్దండుగా..అపర చాణిక్యుడు గా..ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్నవ్యక్తే..తనకి అనుకూలంగా లేని స్థానంలో కూడా అంతా తానై నిలిఛి అందరిని తనవైపుకి తిప్పుకోగల సమర్ధుడు చంద్రబాబు ఇప్పుడు ఈ విషయాలు అన్నీ ఎందుకు నెమరు వేసుకోవడం అనుకుంటున్నారా అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో క్రమ క్రమంగా పట్టుకోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తన హవా కొనసాగించాలని స్కెచ్ లు వేస్తోంది..ఈ క్రమంలోనే

ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ గులాబీ జెండా ఊపడంతో కూటమి కట్టిన కాంగ్రెస్ ,టీడీపీ ,వామపక్ష , కోదండరాం పార్టీలు కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పని చేయాలని అనుకున్నాయి అయితే ఈ కూటమిని బేస్ చేసుకుని తెలంగాణలో మళ్ళీ చక్రం తిప్పాలని భావించిన చంద్రబాబు ఆ క్రమంలోనే బాబ్లీ ని తెరపైకి తీసుకువచ్చాడు అనేది విశ్లేషకుల అభిప్రాయం అదేంటి బాబు కి బాబ్లీ కి లింక్ ఏంటి అంటున్నారా..ఇక్కడే చంద్రబాబు చాణిక్యం ఉపయోగించారు..

కూటమిలో ఉంటే ఏమొస్తుంది అనుకున్న బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోరుకునే బాబు ఎనిమిదేళ్ళ కిత్రం మరుగున పడిన కేసు దుమ్ము దులిపెలా చేశారని టాక్ వినిపిస్తోంది..అదే బాబ్లీ ఇష్యూ..ఎవరో మహారాష్ట్రలో కేసు ఓపెన్ చేయించడం ఏమిటి..చంద్రబాబు అండ్ కో కి అరెస్ట్ నోటీసులు వెళ్ళడం ఏమిటి..? ఈ విషయంలో టీడీపీ నేతలు నెత్తీ నోరు కొట్టుకోవడం ఏమిటి..? అంటే అసలు కధ ఇదే అంటూ విశ్లేషకులు తేల్చి పడేశారు..

Babli Case Reopens On Chandrababu Naidu-

బాబ్లీ విషయంలో ఎందుకు బాబుని అరెస్ట్ చేశారు..తెలంగాణా వాసులకోసం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో నీటికోసం చేసిన ధర్నా మరి ఈ సమయంలో బాబు ని అరెస్ట్ చేస్తే తెలంగాణలో హీరో అయ్యేది ఎవరు..? అనుకుంటే ఈ బాబ్లీ నోటీసుల వెనుకాల ఉన్నది ఎవరో అర్థం అవుతుంది..బాబు , కేసీఆర్ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నారు అనడానికి ఇదొక నిదర్సనం అంటున్నారు రాజకీయ పరిశీలకులు..ఒక వేళ ఈ విషయంలో బాబు ని అరెస్ట్ చేస్తే బీజేపే కి కానీ కేసీఆర్ కి కానీ కలిసోచ్చేది ఏమీ ఉండదు..అందుకే ఈ బాబ్లీ నోటీసుల వెనుక అసలు కుట్ర అంతా చంద్రబాబు పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందే తప్ప దేంట్లో మరే కోణం లేదని తెలంగాణలో తానొక హీరో అనిపించుకోవడానికి బాబు వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.