అరవింద సమేత హంగామా షురూ..     2018-08-27   15:39:13  IST  Ramesh Palla

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రంను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్‌ను వచ్చే నెలలో పూర్తి చేయబోతున్నాడు. చిత్రీకరణ పూర్తి కాకుండానే సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టేందుకు త్రివిక్రమ్‌ పక్కా ప్రణాళికను సిద్దం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. చిత్రం ఎంత భారీగా తీసినా కూడా విడుదలకు ముందు మంచి పబ్లిసిటీ చేస్తేనే భారీ ఓపెనింగ్స్‌ వస్తాయి. అందుకే త్రివిక్రమ్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

Aravinda Sametha Trailer Will Be Launched On Dasara Festival-

Aravinda Sametha Trailer Will Be Launched On Dasara Festival

అరవింద సమేత చిత్రంకు సంబంధించిన టీజర్‌ను ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సెకండ్‌ టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్‌ టీజర్‌ కాకుండా ఏకంగా ట్రైలర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. వినాయక చవితి సందర్బంగా ఎన్టీఆర్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. టీజర్‌లో కూడా చూడని విభిన్నమైన గెటప్‌తో ఎన్టీఆర్‌ ుక్‌ ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రెండు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ కనిపిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక లుక్‌పై క్లారిటీ వచ్చింది.

Aravinda Sametha Trailer Will Be Launched On Dasara Festival-

వినాయక చవితి సందర్బంగా సెకండ్‌ లుక్‌ను రివీల్‌ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సినిమా మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే అంటే సెప్టెంబర్‌ 15 తర్వాత ఎప్పుడైన ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆడియో విడుదలకు ముందే ట్రైలర్‌ను విడుదల చేయడం వల్ల సినిమా స్థాయి పెంచవచ్చు అంటూ త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. అందుకే సెప్టెంబర్‌ నె అంతా కూడా అరవింద సమేత సందడి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈచిత్రంలో కీలక పాత్రలో ఇద్దరు సీనియర్‌ హీరోయిన్స్‌ కనిపించబోతున్నారు. ఆ విషయంపై చిత్ర యూనిట్‌ సభ్యులు ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్‌ రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెప్పబోతున్న విషయం తెల్సిందే.