ఎన్టీఆర్‌ 'అరవింద సమేత' టీం కి పెద్ద షాక్.! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీజర్.!     2018-08-11   09:57:48  IST  Sai Mallula

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. అయితే వరుస లీకులతో ఈ మూవీ యూనిట్‌ ఆందోళనకు చెందుతోంది. టీజర్‌ను ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ టీజర్ కోసం ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక్కో ఫోటో సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం చిత్ర యూనిట్‌ను షాక్‌కి గురిచేస్తుంది.

Aravinda Sametha Teaser Leaked In Social Media-

Aravinda Sametha Teaser Leaked In Social Media

మొన్నామధ్య జూనియర్‌ ఎన్టీఆర్‌, నాగబాబుకి సంబంధించిన ఓ స్టిల్‌ లీక్‌ అయ్యింది. దాంతో ‘అరవింద సమేత’ టీమ్‌ చాలా సీరియస్‌ అయ్యిందనీ, లొకేషన్‌లో ఎక్కడా మొబైల్‌ ఫోన్లకు అనుమతించడంలేదనీ వార్తలొచ్చాయి. నిజానికి, ఈ మధ్య ఏ పెద్ద సినిమాకి అయినాసరే, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. చాలా అంటే చాలా చాలా అన్నమాట. లొకేషన్‌లో ఎవరన్నా ఫోన్‌ పట్టుకుని తిరిగితే చాలు, అనుమానించాల్సిన పరిస్థితి.

Aravinda Sametha Teaser Leaked In Social Media-

‘ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌కి అనుమతి లేదు’ అనే బోర్డులు సినిమా షూటింగుల్లో కన్పించడం సర్వసాధారణమైపోయింది. అయినాగానీ, లీకులు ఆగడంలేదాయె. ‘అజ్ఞాతవాసి’ పరాజయం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ‘అరవింద సమేత’ కోసం అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకుంటున్నా, లీకుల బెడద తప్పడంలేదు. తాజాగా మరికొన్ని స్టిల్స్‌ లొకేషన్‌ నుంచి లీక్‌ అయ్యాయి. ఈసారి లీక్‌ అయిన ఫొటోల్ని చూస్తే, అది ఓ వీడియోకి సంబంధించిన వ్యవహారంగా కన్పిస్తోంది.

హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ఆగస్ట్‌ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అక్టోబర్‌ 10న మూవీ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.