ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన ఎన్టీఆర్‌.. ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశ   Aravinda Sametha Disappoints Fans About Audio Release Function     2018-09-14   09:56:56  IST  Ramesh P

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను ఈనెల 20న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా గత వారం రోజులుగా పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. అరవింద సమేత చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం లేదని, పాటలను డైరెక్ట్‌గా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 20వ తారీకున యూట్యూబ్‌ ద్వారా పాటలను విడుదల చేయబోతున్నట్లుగా ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి అనధికారికంగా క్లారిటీ వచ్చేసింది.

‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తాడు అంటూ ప్రచారం జోరుగా సాగింది. ఎన్టీఆర్‌ స్వయంగా బాలయ్యతో మాట్లాడి ఆడియో విడుదల కార్యక్రమంకు రావాల్సిందిగా కోరాడని, అందుకు బాబాయి ఓకే చెప్పాడు అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఊహల్లో తేలిపోయారు. ఆ తర్వాత మహేష్‌బాబు కూడా త్రివిక్రమ్‌ కోసం ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇక చివరిగా అమితాబచ్చన్‌ గురించి కూడా వార్తలు వచ్చాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ ఒక కీలకమైన గెస్ట్‌ రోల్‌ను పోషించాడట. దాంతో ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరు కాబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. అన్ని వార్తలు కూడా గాలి వార్తలే అని తేలిపోయింది. భారీ ఎత్తున ఫ్యాన్స్‌ ఊహించుకున్న ఊహాగాణాలన్నింటికి కూడా తెర పడ్డట్లయ్యింది. ఆడియో విడుదల గెస్ట్‌ల సంగతి పక్కన పెడితే అసలు ఆడియో విడుదల కార్యక్రమమే లేదు అంటూ తేలిపోయింది.

Aravinda Sametha Disappoints Fans About Audio Release Function-

ఇన్ని రోజులు ఊహల్లో ఊగిసలాడిన ఫ్యాన్స్‌ ఇప్పుడు ఉసూరుమంటున్నారు. అయితే ఆడియో విడుదల కార్యక్రమం లేకున్నా సినిమా విడుదలకు వారం ముందు ప్రీ రిలీజ్‌ వేడుక చేయాలని భావిస్తున్నారు అంటూ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. ఆ వేడుకలో పైన పేర్కున్న గెస్టుల్లో ఎవరో ఒకరు అయినా పాల్గొంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.