బాబు 'సిత్రం' ఇలాగే ఉంటుంది ! ఎన్టీఆర్ తో అప్పుడు అలా ఇప్పుడు ఇలా !   AP Govt Confirms Aravindha Sametha Benefit Shows     2018-10-10   09:53:30  IST  Sai M

ఏపీ సీఎం చంద్రబాబు కు ఎక్కడ రాజకీయం చేయాలో బాగా తెలుసు తనకు అవసరం లేదు .. ఉపయోగపడదు అనుకుంటే వారిని ఎన్నిరకాలుగా అయినా ఇబ్బంది పెట్టేందుకు వెనుకాడడు. అదే తనకు అవసరం అంటుకుంటే మాత్రం ఎంత స్థాయికి అయినా దిగజారిపోవడానికైనా రెడీ గా ఉంటాడు. అందుకే కదా మరి ఆయన ఇంతకాలం రాజకీయాల్లో ఉండగలిగాడు. బాబు రెండు కళ్ల సిద్ధాంతమే జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలకు చాలా ఆటంకాలు కల్గించారు. ఏపీలో ఆ సినిమా విడుదలకు ముప్ప తిప్పలు పెట్టారు. సరిగా అదే సమయంలో బాలయ్య సినిమా కూడా విడుదలకు రెడీగా ఉండటంతో జూనియర్ సినిమాకు ఇబ్బందులు కల్పించారు. థియేటర్లు దొరకకుండా రాజకీయం చేశారని బయటకి పొక్కడంతో అభాసుపాలయ్యారు.

అప్పట్లో చంద్రబాబు కుటుంబం తారక్ తో ఎలా వ్యవహరిచిందో అంత ఈజీగా మరిచిపోయే అంశం కాదు. బాలయ్య సినిమాతో తారక్ ఢీ కొట్టాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చింది. దానికి తోడు లోకేష్ కూడా జతకలిశారు. ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లను దొరకకుండా కుట్ర పన్నారనే అభిప్రాయాలు గట్టిగా వినిపించాయి. చివరకు చాలా ఊర్లలో తారక్ సినిమాకు థియేటర్లే దొరకలేదు. బాలయ్య సినిమానే ఎక్కువ థియేటర్లను ఆక్రమించేసింది.

AP Govt Confirms Aravindha Sametha Benefit Shows-

అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల్లో జూనియర్ అవసరం టీడీపీకి లేకపోయింది. కానీ ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ఇప్పడు జూనియర్ అవసరం టీడీపీకి చాలా ఉంది. అందుకే … త్వరలో విడుదల కానున్న తారక్ సినిమా ‘అరవింద సమేత..’కు ప్రత్యేక షోలు వేసుకోవడానికి బాబు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మెల్లిగా జూనియర్ కి దగ్గరయ్యి ఆయన ద్వారా రాజకీయ లబ్ది పొందాలని బాబు మాస్టర్ స్కెచ్ వేస్తున్నాడు.