అమ్మగా మారబోతున్న భాగమతి..     2018-08-21   13:04:37  IST  Ramesh Palla

బాహుబలి చిత్రం తర్వాత కేవలం ‘భాగమతి’ చిత్రంలోనే నటించింది అనుష్క. కాస్త బరువు తగ్గేందుకు దాదాపు ఆరు నెలల సమయం తీసుకున్న అనుష్క మళ్లీ ఇప్పుడు వరుసగా చిత్రాల్లో నటిస్తూ ఉంది. ఇప్పటికే రెండు చిత్రాలకు కమిట్‌ అయిన అనుష్క తాజాగా మరో సినిమాకు ఫిక్స్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది. తమిళంలో భారతిరాజా దర్శకత్వంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ తెరకెక్కబోతుంది. ఆ చిత్రంలో జయలలిత పాత్రకు గాను అనుష్కను ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

Anushka Shetty To Play Amma Character In Her Next-

Anushka Shetty To Play Amma Character In Her Next

తమిళంలో జయలలిత బయోపిక్‌ు ఇప్పటికే రెండు ప్రకటించారు. ఎవరికి వారే అన్నట్లుగా బయోపిక్‌ు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు భారతి రాజా కూడా తాను అమ్మ బయోపిక్‌ను తీయబోతున్నట్లుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆమె జీవితంకు సంబంధించిన విశేషాలను రీసెర్చ్‌ చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. అమ్మ పాత్రకు అనుష్క అయితే అన్ని విధాలుగా బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడంలో అనుష్కకు మంచి గుర్తింపు ఉంది. అందుకే అమ్మ బయోపిక్‌కు అనుష్క వల్ల ఈ నాలుగు భాషల్లో ఆధరణ దక్కే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నాడు.

అనుష్క ఖచ్చితంగా జయలలిత పాత్రకు పూర్తి న్యాయం చేయగలదు అంటూ సినీ వర్గాల వారు నమ్ముతున్నారు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు పెట్టింది పేరు అయిన అనుష్క ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో జయలలిత బయోపిక్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న జయలలిత బయోపిక్‌ ద్వారా అనుష్క మరోసారి బిజీ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Anushka Shetty To Play Amma Character In Her Next-

‘బాహుబలి’ చిత్రం తర్వాత అనుష్క వరుసగా పెద్ద చిత్రాలు చేయనుందని అంతా భావించారు. కాని ఆ చిత్రం తర్వాత అనుష్క భాగమతిగా మాత్రమే కనిపించింది. పెద్ద హీరోలు ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. కారణం అనుష్క సీనియర్‌ హీరోయిన్‌ అవ్వడంతో పాటు, ఆమె లావుగా అనిపించడంతో ఆమెతో నటించేందుకు హీరోలు ఆసక్తి చూపించడం లేదు. త్వరలోనే నాజూకుగా మారి అనుష్క రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.