మరోసారి ట్విట్టర్ లో అడ్డంగా బుక్ అయిన 'అనుష్క'.! ఎలా ట్రోల్ చేస్తున్నారో చూడండి!

భారత సెలెబ్రిటీ జోడీ అనుష్కశర్మ- విరాట్ కొహ్లీ ఎప్పుడు వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు.సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటారు…ఓ చెత్త వివాదంలో చిక్కుకొన్నారు.

 Anushka Sharma Promotes Google Pixel On Twitter Using Iphone-TeluguStop.com

లగ్జరీ కారులో ప్రయాణం చేస్తూ ముంబై రోడ్డుపై చెత్తవేసిన ఓ యువకుడిని అనుష్క మందలించడం దానిని వీడియో తీసి విరాట్ కొహ్లీ నెట్ లో పోస్ట్ చేయటం పట్ల మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది.చివరకు అనుష్క పరిస్థితి తిట్టబోయి తిట్లుతిన్నట్లుగా తయారయ్యింది.

తరవాత తన అప్‌కమింగ్‌ సినిమా ‘సూయి ధాగా-మేడిన్‌ ఇండియా’ ట్రైలర్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పించాయి.

ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అనుష్క.

ఈ సారి ఏం చేసిందో అనుకుంటున్నారా.? ఐఫోన్‌ను వాడుతూ.గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ట్విటర్‌లో ప్రమోట్‌ చేశారు.ప్రపంచంలో టెక్‌ బ్లాగర్స్‌లో ఒకరైన, యూట్యూబ్‌ సెన్సేషన్‌ మార్క్స్‌ బ్రౌన్లీ ఈ విషయాన్ని గుర్తించారు.ఇంకేముంది ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు.దీంతో అనుష్క మరోసారి ట్విటర్‌లో బుక్‌ అయిపోయారు.

అనుష్క శర్మ, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ప్రమోట్‌ చేయడానికి, ఐఫోన్‌ను వాడుతూ ట్వీట్‌ చేశారని తెలిపారు.ఆమె ట్వీట్‌ను కూడా స్క్రీన్‌షాట్‌ తీసి షేర్‌ చేశారు.పొరపాటు జరిగినట్టు గుర్తించిన అనుష్క, ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసి, మరోసారి షేర్‌ చేశారు.కానీ ఆ లోపే అసలు ఫోటో వైరల్ అయిపొయింది.‘డిలీట్‌‌ చేశావ్‌, మళ్లీ రీట్వీట్‌ చేశావు.కానీ కొంచెం కిందకి స్క్రోల్‌ డౌన్‌ చేయండి.

ఐఫోన్‌ నుంచి వచ్చిన మరిన్ని పిక్సెల్‌ యాడ్స్‌ కనిపిస్తాయి’ అని పేర్కొన్నారు.కొంతమంది ట్విటర్‌ యూజర్లు మాత్రం మార్క్స్‌ను హెచ్చరిస్తున్నారు.

మీరు బ్లాక్‌ అవుతారేమో చూసుకోండంటూ వ్యాఖ్యానిస్తున్నారు.అయితే ఒకవేళ ఫోటోను పిక్సెల్‌ ఫోన్‌ నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని, ఐఫోన్‌ నుంచి పోస్టు చేశారేమో అంటూ కొంతమంది అనుష్కను వెనకేసుకొస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube