'మరి ఇప్పుడేం సమాధానం చెప్తావ్?' అంటూ 'అను' చేసిన పనికి 'సామ్' పై నెటిజెన్స్ ఫైర్.!   Anu Emmanuel Kissing Chay's Foot Land Samantha In Trouble     2018-09-13   10:38:50  IST  Sainath G

గత దశాబ్దం నుండి తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత దాదాపు అగ్ర హీరోలందరితో నటించి హిట్స్ అందుకుంది. సమంత హీరోయిన్ అంటే హిట్ గారంటీ అన్న సెంటిమెంట్ సంపాదించుకుంది. ఆ టాప్ హీరోయిన్ గా మాత్రమే కాదు అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత మంచి పేరు తెచ్చుకుంది. ఈ రోజు ఆమె నటించిన యూ టర్న్ చిత్రం విడుదల అయ్యింది. అదే సమయంలో చైతు నటించిన “శైలజ రెడ్డి అల్లుడు” కూడా రిలీజ్ అయ్యింది.

ఈ చిత్రంలోని ఓ పాటలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్.. చైతు పాదాల దగ్గర ముద్దు పెట్టుకొనే షాట్ ఒకటి ఉంది. అంతేకాదు తన మొహాన్ని మొత్తం చైతు పాదాల మీద పెట్టి తన్మయత్వం చెందే సీన్ ఒకటి ఈ పాటలో దర్శనమిచ్చింది. వీటిని తీసుకొని ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు. మధ్యలో మహేష్ బాబు ఫాన్స్ ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా.? దాని వెనకాల కారణం 1 నేనొక్కడినే సినిమా.

Anu Emmanuel Kissing Chay's Foot Land Samantha In Trouble-

అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో పట్టుకుంటూ హీరోయిన్ ఉండే పోస్టర్ పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి. అప్పట్లో సమంతపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు మహేష్ ఫ్యాన్స్. అయితే ఇప్పటికీ ఆ విషయాన్ని వారు మర్చిపోలేదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఆరోజు మహేష్ సినిమా పోస్టర్ చూసే అంతగా రియాక్ట్ అయిన సమంత ఈరోజు చైతూ అంతకన్నా ఎక్కువగా అనుతో చేయించుకోవడానని ఏమనాలో చెప్పాలంటూ సమంతని నిలదీస్తున్నారు. సమంత ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. మరి తనను తాను ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి!