వైసీపీలో మరో ఫైర్ బ్రాండ్ ... రోజా హావ తగ్గినట్టేనా ..     2018-08-29   11:18:35  IST  Sai Mallula

ఎవరి హవా ఇప్పటివరకు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కొక్కరికి పాపులారిటీ అమాంతం వచ్చేసి ఒక్కరోజులోనే సెలెబ్రెటీ అయిపోతుంటారు. ఇప్పుడు అలాంటి హోదా అమాంతం తెచ్చేసుకున్న ఒక మహిళ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతున్నారు. ఆమె ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఉన్న నగరి ఎమ్యెల్యే రోజా పరిస్థితి గందరగోళంలో పడింది. అసలే రోజా మీద జగన్ కు సదభిప్రాయం లేదు. ఆమెను పార్టీలో ఉంచలేక వెళ్లగొట్టలేక జగన్ సతమతం అవుతున్నాడు. ఈ దశలో రోజా వాక్చాతుర్యానికి మించిన మరో నాయకురాలు పార్టీలో చేరడంతో ఇక పార్టీ తరపున ఆమెకు రోజా భద్రతలు అప్పగించే ఛాన్స్ ఉందని వైసీఏపీ వర్గాలు చెప్తున్నాయి.

Another Firebrand Rajani Kumari In YCP Instead Of Roja-

Another Firebrand Rajani Kumari In YCP Instead Of Roja

తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్యెల్యే టికెట్ ఆశించి అక్కడ వర్కవుట్ కాకపోవడంతో ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎన్నారై మహిళ, విడదల రజనీ కుమారి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అయితే, ఇదంతా ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్నా.. ఆమె వ్యూహాత్మకంగా మాత్రం అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ ఆమె పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనను పరిచయం చేసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సైతం షాకిస్తూ.. ఆయననే ఓడిస్తానని సవాల్ కూడా చేసేసింది.

ఆమె వైసీపీలో చేరిన దగ్గర నుంచి జగన్‌కు అనుకూలంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రారంభించింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదాపై కీలక మైన వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నారని, ఆయన యూటర్న్ అంకుల్ అయ్యారని విమర్శించింది. గడిచిన నాలుగేళ్లుగా జగన్ ప్రజల పక్షాన పోరాడుతు న్నారని, ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పటికీ సజీవంగా ఉందంటే అది కేవలం జగన్ వల్లేనని చెప్పారు.

Another Firebrand Rajani Kumari In YCP Instead Of Roja-

వాస్తవానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారానే ఆమె చంద్రబాబుకు పరిచయం అయ్యారు. మహానాడులో ఆవేశపూరితంగా ఆమె చేసిన ప్రసంగం ఎంతోమందిని ఆకట్టుకుంది. చంద్రబాబు ను కూడా ఆమె ప్రసంగం ఆకట్టుకుంది. ఇక వైసీపీలో రోజా హవా తగ్గుతుండడంతో ఆ లోటును రజనీ ద్వారా భర్తీ చేయాలనీ జగన్ ఆలోచన చేస్తున్నాడట. అదే జరిగితే ఇక వైసీపీలో రోజా పరిస్థితి మరింత దిగజారే అవకాశం కనిపిస్తోంది.