సోషల్ మీడియాలో వైరలైన దిండ్ల పిల్లోడు,మహింద్రాలో జాబ్ కొట్టేశాడు     2018-08-12   12:14:13  IST  Sai Mallula

మంచంపైన ఆడుకుంటున్న పిల్లాడు కిందికి దిగాలనుకున్నాడు..కాని కిందికి దిగలేక దిగితే పడిపోతానని ..మంచంపై ఉన్న దిండ్లను ఒక్కోటి కింద పడేసి..ఎంచక్కా ఆ దిండ్లపైకి దిగి పోయాడు..ఆ పిల్లాడి వయసు నిండా ఏడాది నిండి ఉండదు..ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది.ఇప్పుడు అదే వీడియో మహింద్రా కంపెని అధినేత ఆనంద్ మహింద్రా కంటపడింది.వెంటనే ఆ పిల్లాడికి ఉద్యోగం ఇస్తున్నట్టు ట్వీట్ చేశారు ఆనంద్ మహింద్రా..

Anand Mahindra Latest Tweet Goes Viral Little Genius Kid-

Anand Mahindra Latest Tweet Goes Viral Little Genius Kid

ఏడాది నిండని పిల్లాడు ఏం ఉద్యోగం చేస్తాడు అని ఆశ్చర్యపోతున్నారా?బెడ్ దిగడానికి దిండ్లును కిందపడేసి సేఫ్‌గా లాండ్ కావడం చూసిన నెటిజన్లు వాడి తెలివిని వాట్ ఏ జీనియస్ అంటూ పొగిడేసారు..చాలా షార్ప్ పిలగాడు అంటూన కితాబులిచ్చేశారు.ఇటీవల ఈ వీడియో చూసిన ఆనంద్ మహింద్రా వాడి టాలెంట్‌కు ఫిదా అయిపోయి జాబ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడే కాదులెండి.. బుడ్డోడు కాలేజీ చదువు పూర్తిచేసుకున్న తర్వాత. ‘ఓకే. ఈ చిన్నోడు కాలేజీ పూర్తి చేసుకున్నాక కాంట్రాక్టు కుదుర్చుకుంటాను. వీడు మేం చేపట్టే ప్రాజెక్టులన్నీ సులువుగా ల్యాండ్ అయ్యేలా చూస్తాడు.. వాట్ ఏ లిటిల్ జీనియస్.. ’ అని ట్వీట్ చేశాడు ఆనంద్.ప్రతిభ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వాటంతట అవే వస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ..చూడాలి పెద్దయ్యాక మహింద్రాలో ఉద్యోగం చేస్తాడో అంతకంటే పదింతలు ఎక్కువ ఎదుగుతాడో..