అమృత సంచలనం నిర్ణయం...తండ్రి ఆస్తులను ఏం చేయబోతుందో తెలుసా.?   Amrutha Wants Her Father Asserts To Change As Pranay Trust Bhavanthi     2018-09-22   09:54:27  IST  Sainath G

ణయ్ అమృత ల లవ్ స్టోరీ తెలుగు రాష్ట్ర ప్రజలను ఎంత కన్నీళ్లు పెట్టించిందో అందరికి తెలిసిందే. ప్రణయ్ హ‌త్య‌పై పోరాటం ప్రారంభించారు అమృత. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని చెప్పారు. అంతేకాదు ప్రణయ్ ఆశయాన్ని నెరవేరుస్తా అన్నారు. కుల రహిత సమాజం నిర్మించడం ప్రణయ్ ఆశయం.

ఇది ఒక సైడ్ అయితే…మరొక సైడ్ మారుతి రావు అని కూతురు అమృత అంటే ఎంతో ప్రేమ అంట. కూతురుకి కావాల్సిన అస‌రాల‌న్నీ దెగ్గ‌రుండి తీర్చాడు. అయితే అమ్రుత మీద ప్రేమ‌తో అమృత జీనియస్ స్కూల్ ను ఏర్పాటు చేసాడు. కానీ ఇప్పుడు ఆ స్కూల్ ను ప్రణయ్ పేరిట మార్చాలని అమృత కోరుకుంటుంది.

అమృత ప్ర‌ణ‌య్ కుటుంభ‌స‌బ్యుల‌తో పాటు..న‌ల్గొండ క‌లెక్ట‌ర్ గౌరవ్ ఉప్పల్ ను క‌లిసారు. అమృత లవ్ స్టోరీ గురించి కలెక్టర్ గారు కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువు మధ్యలోనే ఎందుకు ఆపివేశారు..? అనే ప్రశ్నలు అడిగారు. ఏం సహాయం కావాలన్న చేస్తానని చెప్పారు. అరెస్టయిన వారికి బెయిల్ రాకుండా చూడాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అమృత కోరడంతో, అందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ. 8 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని క‌లెక్ట‌ర్ వెళ్ల‌డించారు.

Amrutha Wants Her Father Asserts To Change As Pranay Trust Bhavanthi-

అంతేకాదు తన పేరిట ఉన్న అమృత జీనియస్ స్కూల్ భవనాన్ని ప్రణయ్ ట్రస్ట్ భవంతిగా మార్చాలని, తన తండ్రి ఆస్తులను ట్రస్టుకు చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అమృత డిమాండ్ చేసింది. మొత్తానికి తండ్రి కూతురిమీద ప్రేమ‌తో ఇచ్చిన ఆస్తిని కూతురైన అమృత ప్ర‌ణ‌య్ పేరుతో ట్ర‌స్ట్ ఏర్పాటు చేస్తాన‌ని చెప్ప‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.