ఉసిరి నీటిలో ఎన్ని సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో     2018-08-22   15:09:21  IST  Laxmi P

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి నీరు ఆరోగ్యానికే కాకుండా అనేక చర్మ,జుట్టు సమస్యల పరిష్కారానికి కూడా బాగా సహాయపడుతుంది. ఉసిరి నీటిని ఎలా తయారుచేయాలా అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ గా ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. నాలుగు ఉసిరికాయలను తీసుకోని రెండు గంటలు నానబెట్టి ముక్కలు కోసి మిక్సీ చేసి జ్యుస్ గా చేసుకొని ఉపయోగించాలి.

Amla Water Skin Benefits-

Amla Water Skin Benefits

ఉసిరి నీటితో ముఖాన్ని ప్రతి రోజు క్రమం తప్పకుండా కడుగుతూ ఉంటే చర్మం టైట్ గా మారటమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

ఉసిరి నీటిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే చర్మలో సాగె గుణం పెరుగుతుంది. అలాగే కొల్లాజిన్ ఉత్పత్తి పెరిగి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి.

ఉసిరి నీటిలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన చర్మంపై ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఉసిరి నీటిలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Amla Water Skin Benefits-

ముఖంలో వైట్ హెడ్స్ తొలగించడంలో ఉసిరి నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి శుభ్రం చేసి చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. వారానికి ఒకసారి ఉసిరి నీటిని ముఖానికి రాస్తూ ఉంటే వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

ఉసిరి నీటి లో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన చర్మంలో మృత కణాలు తొలగిపోతాయి.