'భారత్ భేష్'..అమెరికా మెచ్చుకోలు.!   America Survey On Indian Child Labour     2018-09-24   12:16:25  IST  Bhanu C

భారత్ ని అమెరికా మెచ్చుకుంది భేష్ అంటూ కితాబు ఇచ్చింది కూడా.. అదేంటి రెండు రోజుల క్రిత్రమే ఫ్యాన్స్ s -400 విషయంలో హెచ్చరికలు చేసిన అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా సూపర్ అంటూ పొగడటం ఏమిటి అనుకుంటున్నారా అందుకు రీజన్ లేకపోలేదు..హెచ్చరించిన రంగం వేరు ప్రశంసలు అందుకున్న రంగం వేరు సో ఇంతకీ ప్రశంసలు అందుకోవడానికి రీజన్ ఏమిటి అంటే..?

భారత్ లో బాలకార్మిక వ్యవస్థని రూపు మాపడంలో భారత్‌ గతేడాది గణనీయమైన పురోగతి సాధించిందని అమెరికా అధికార ఒక కీలకమైన నివేదికలో వెల్లడించాడు..2017లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పురోగతి సాధించిన 14 దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలవడంతో అమెరికా ప్రశంసల వర్షం కురిపించింది.అమెరికా కార్మిక శాఖ శనివారం విడుదల చేసిన “చైల్డ్‌ లేబర్‌ అండ్‌ ఫోర్స్‌డ్‌ లేబర్‌” వార్షిక నివేదికలో ఈ వివరాలున్నాయి.

America Survey On Indian Child Labour-

అయితే ఈ బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు ప్రపంచంలోని 132 దేశాలు తీసుకుంటున్న చర్యలను కచ్చితంగా అధ్యయనం చేసేందుకు..ఈ ఏడాది మరింత కఠిన ప్రమాణాలను వాడినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం కొలంబియా, పరాగ్వే, భారత్‌సహా 14 దేశాలే ఈ ఖచ్చితమైన ప్రమాణాలను అందుకున్నట్లు తెలిపింది.