ఆ ఫోటో ఎవరు తీశారంటే.? వైరల్ గా మారిన మెగాస్టార్ బర్త్ డే ఫోటోపై అల్లు శిరీష్ ట్వీట్.!     2018-08-23   12:13:09  IST  Sai Mallula

ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టినరోజు.. ఇది టాలీవుడ్ లోని మెగా అభిమానులకు పండుగ రోజు. ఇప్పటికే తన 150వ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు సైరాతో మరోసారి చిరు పెర్ఫార్మన్స్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు.

Allu Sirish Tweet Chiru Birthday Pics-

Allu Sirish Tweet Chiru Birthday Pics

మెగాస్టార్ బర్త్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. అభిమానులు కూడా తమ హీరో బర్త్ డే వేడుకను ఎవరికి వారు కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు స్టార్ డైరెక్టర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన పిక్‌తో అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. ‘‘అల్లు నివాసంలో మెగాస్టార్ బర్త్ డే బాష్. బాస్‌, బాయ్స్, నిన్న పార్టీకి హాజరైన డైరెక్టర్లతో ఓ పిక్. ఈ పిక్‌ను మా డాడీ తీశారు’’ అంటూ శిరీష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అల్లు అరవింద్ పిక్ తీస్తుంటే మెగాస్టార్‌తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శిరీష్, కొరటాల శివ, సుకుమార్, బోయపాటి శ్రీను తదితరులు ఫోటోకు ఫోజిచ్చారు.