చిరు చిన్నల్లుడికి అల్లు అరవింద్‌ పెద్ద షాక్‌     2018-08-12   11:13:05  IST  Sai Mallula

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా ‘విజేత’ చిత్రంతో పరిచయం అయ్యాడు. సాయి కొర్రపాటి నిర్మించిన ఆ చిత్రంకు రాకేశ్‌ శశి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘విజేత’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో మెగా హీరో మూవీ ఇలాగేనా ఉండేది అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. మెగా ఫ్యాన్స్‌ కూడా తీవ్రంగా నిరాశను వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవి తన అల్లుడి రెండవ సినిమాను అల్లు అరవింద్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.

కళ్యాణ్‌ రెండవ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన అల్లు అరవింద్‌ కథ ఎంపిక పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే కళ్యాణ్‌ దేవ్‌ నటనపై విమర్శలు ఉన్న నేపథ్యంలో ట్రైనింగ్‌ తీసుకోవాలని సూచించాడు. విజేత చిత్రంలో కథ కథనం బాగా లేకపోవడంతో పాటు కళ్యాణ్‌ నటన ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ టాక్‌ వినిపించింది. అందుకే కళ్యాణ్‌ రెండవ చిత్రం ఆలస్యం చేసి, మొదట ఆయనకు నటనలో శిక్షణ ఇప్పించాలని అల్లు అరవింద్‌ భావిస్తున్నాడు.

Allu Arvind Gives Big Punch To Kalyan Dev-

Allu Arvind Gives Big Punch To Kalyan Dev

విజేత చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో వెంటనే మరో సినిమాను చేసి సక్సెస్‌ దక్కించుకోవాలని కళ్యాణ్‌ ఉవ్విల్లూరుతున్నాడు. కాని అల్లు అరవింద్‌ మాత్రం సంవత్సరం పాటు నటన మరియు డాన్స్‌లో శిక్షణ తీసుకున్న తర్వాతే సినిమాల్లో నటించాలని సూచించాడట. చిరంజీవి కూడా అదే చెప్పడంతో ప్రస్తుతం విదేశాల్లో నటన, దర్శకత్వం, డాన్స్‌లలో కళ్యాణ్‌ దేవ్‌ శిక్షణ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. కళ్యాణ్‌ రెండవ సినిమా ఇప్పట్లో ప్రారంభం కాకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ‘విజేత’ చిత్రం విషయంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా అల్లు అరవింద్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కళ్యాణ్‌ రెండవ మూవీ ప్రారంభం అయ్యి, 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. కళ్యాణ్‌ రెండవ సినిమాతో అయినా సక్సెస్‌ను అందుకుంటాడా అనేది చూడాలి.