ఆ దర్శకుడిపై అప్పుడే కర్చీఫ్‌ వేసేసిన అల్లు అర్జున్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ     2018-08-31   14:38:51  IST  Ramesh Palla

దర్శకుల ఎంపిక విషయంలో అల్లు అర్జున్‌ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అందుకే బన్నీకి ఈమద్య కాంలో మంచి సక్సెస్‌లు దక్కాయి. అయితే చివరి చిత్రం ‘నా పేరు సూర్య’ చిత్రం విషయంలో దర్శకుడిపై నమ్మకం పెట్టాడు, కాని అది కాస్త ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహం పడకుండా తదుపరి చిత్రం కోసం ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నాడు. ఒక మంచి దర్శకుడి కోసం అన్వేషిస్తున్న బన్నీ త్వరలో ఒక తమిళ దర్శకుడితో ద్విభాష చిత్రంను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత తన సూపర్‌ హిట్‌ చిత్రం రేసుగుర్రం చిత్రం దర్శకుడిపై కర్చీఫ్‌ వేసినట్లుగా తెలుస్తోంది.

Allu Arjun Next Film Director Surender Reddy Is Conformed-

Allu Arjun Next Film Director Surender Reddy Is Conformed

‘రేసుగుర్రం’ చిత్రంతో బన్నీ కెరీర్‌లోనే బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను తెచ్చి పెట్టిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి. ప్రస్తుతం ఈయన మెగాస్టార్‌ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానిన తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో జరుగుతుంది. ఈ సమయంలోనే దర్శకుడు సురేందర్‌ రెడ్డితో బన్నీ ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

సైరా చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే బన్నీతో తాను చిత్రంను చేయబోతున్నట్లుగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఈయన గతంలో మహేష్‌బాబుతో ఒక చిత్రం చేయడం జరిగింది. మరో చిత్రంను ఈయన మహేష్‌తో చేయాల్సి ఉన్నా కూడా అల్లు అర్జున్‌ బుక్‌ చేసుకోవడం జరిగిందని సమాచారం అందుతుంది. బన్నీ నా పేరు సూర్య చిత్రం తర్వాత ప్రయోగాలకు వెళ్ల కూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లను చేస్తున్నాడు.

Allu Arjun Next Film Director Surender Reddy Is Conformed-

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లను చేయడంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి సిద్ద హస్తుడు అనే విషయం తెల్సిందే. అందుకే బన్నీ ఈ దర్శకుడిపై నమ్మకం పెట్టుకున్నట్లు సమాచారం అందుతుంది. వీరిద్దరి కాంబో మూవీ 2020లో వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. వీరిద్దరి కాంబోలో మరో రేసుగుర్రం వంటి చిత్రం వస్తుందని మెగా ఫ్యాన్స్‌ హ్యాపీగా ఎదురు చూస్తున్నారు.