పేపర్‌బాయ్‌.. పై అంచనాలు పెంచేసిన అల్లు అరవింద్‌     2018-08-26   09:28:12  IST  Ramesh Palla

సంతోష్‌ శోభన్‌ హీరోగా తెరకెక్కిన ‘పేపర్‌బాయ్‌’ చిత్రంపై నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేవు. అసలు సినిమా గురించి ఎక్కవ శాతం ప్రేక్షకులకు తెలియదు. కాని ఈ చిత్రం గురించి ఓవర్‌ నైట్‌లోనే అంచనాలు తారుమారు అయ్యాయి. పేపర్‌బాయ్‌ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు అల్లు అరవింద్‌ మొత్తం రైట్స్‌ను దక్కించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల హక్కులు హోల్‌సేల్‌గా అల్లు అరవింద్‌ కొనడంతో ఈ చిత్రంపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో చెప్పకనే చెప్పొచ్చు.

Allu Aravind Hikes Expectations On Paperboy-

Allu Aravind Hikes Expectations On Paperboy

దర్శకుడు శోభన్‌తో వర్క్‌ చేసిన అనుబంధంతో మహేష్‌బాబు మరియు ప్రభాస్‌లు ఆయన కొడుకు అయిన సంతోష్‌ నటించిన ఈ చిత్రానికి ప్రమోషన్‌ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరు పేపర్‌బాయ్‌ చిత్రం సక్సెస్‌ కావాలని కోరుకుంటూ విషెష్‌ చెప్పారు. త్వరలోనే వీరిద్దరు మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. దాంతో పాటు తాజాగా అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన కారణంగా ఒక్కసారిగా బయ్యర్ల దృష్టిని ఈ చిత్రం ఆకర్షిస్తుంది.

సంతోష్‌ శోభన్‌కు జోడీగా ఈ చిత్రంలో రియా సుమన్‌, తాన్య హోప్‌లు హీరోయిన్స్‌గా నటించారు. జయశంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సంపత్‌ నంది నిర్మించాడు. రచ్చ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్న సంపత్‌ నంది నిర్మాణంలో తెరకెక్కడంతో ఆసక్తి నెలకొంది. తాజాగా అల్లు అరవింద్‌ చేయి కూడా పడటంతో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు.

Allu Aravind Hikes Expectations On Paperboy-

మొదట ఈ చిత్రాన్ని వచ్చే నెల 7న విడుదల చేయాలని భావించారు. కాని అనూహ్య కారణాల వల్ల ఈ చిత్రం ఈ చిత్రంను ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సేఫ్‌ జోన్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అల్లు అరవింద్‌ తీసుకున్న సినిమా అంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్‌ ఉంటుంది. అందుకే ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని అన్ని వర్గాల ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.