గోవిందంపై అల్లు అవరింద్‌కు ఎంత నమ్మకమో తెలుసా?     2018-08-12   13:41:19  IST  Laxmi P

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యాడు. ఆ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్న రీతిలో సినీ వర్గాల్లో నమ్మకం ఉంది. ఈమద్య నటించిన మహానటి చిత్రం కూడా విజయ్‌ దేవరకొండకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. దాంతో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘గీత గోవిందం’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్‌ మరియు ట్రైలర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఇక విజయ్‌ పాడిన పాట మరియు ఇతరత్ర విషయాలు సినిమాపై యూత్‌ ఆడియన్స్‌లో విశేషంగా అంచనాలను ఎంచడం జరిగింది. అందుకే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ అయ్యే అవకాశం ఉన్నా కూడా అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.

Allu Aravind Full Confidence On Geetha Govindam Movie-

Allu Aravind Full Confidence On Geetha Govindam Movie

దాదాపు 13 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ కాకుండా ఇతర రైట్స్‌తోనే ఏకంగా 7 కోట్ల వరకు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. బడ్జెట్‌ పూడాలి అంటే మరో ఆరు కోట్లు వస్తే సరిపోతుంది. అన్ని ఏరియాల్లో సినిమాను అమ్మితే ఖచ్చితంగా 12 కోట్లకు ఎక్కువగానే వచ్చేది. కాని నిర్మాత అల్లు అరవింద్‌ మాత్రం సినిమాపై నమ్మకంతో సొంతంగా విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.

సునాయంసగా ఈ చిత్రం 15 కోట్ల షేర్‌ను దక్కించుకుంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. కాస్త సక్సెస్‌ టాక్‌ వచ్చినా కూడా సినిమా 20 నుండి 25 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని, ఇలాంటి సమయంలో ఎందుకు ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాలని నిర్మాత భావించాడు. అందుకే అన్ని ఏరియాల్లో కూడా సొంతంగానే విడుదల చేస్తున్నాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అల్లు అరవింద్‌ నమ్మకంను ఏమేరకు నిలుపుతుందో చూడాలి.