చెమటతో తడిసిపోయిన షర్ట్‌ను విప్పడంతో ఆ టెన్నిస్ ప్లేయర్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది.. అసలేమైంది  

యూఎస్‌ ఓపెన్‌లో ఫ్రాన్స్‌ క్రీడాకారిణి అలిజె కార్నెట్‌ పొరపాటున చేసిన ఓ పని వివాదాస్పదమైంది. యూఎస్ ఓపెన్ లో కార్నెట్, జొహన్నా లార్సన్ (స్వీడన్)తో టెన్నిస్ సింగిల్స్ మ్యాచ్ ఆడుతోంది. మ్యాచ్‌ మధ్యలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం కార్నెట్‌ పది నిమిషాలు విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్నెట్‌ చెమటతో తడిసిపోయిన తన టాప్‌ను మార్చుకుంది కార్నెట్. ఐతే, అది తప్పుగా వేసుకొని కోర్టులోకి వచ్చింది. మళ్లీ లాకర్‌ రూమ్‌లోకి వెళ్లకూడదని భావించి.. గ్రౌండ్‌లోనే పది సెకన్ల వ్యవధిలో మార్చుకుంది. నిబంధనల ప్రకారం వుమెన్ ప్లేయర్స్ మైదానంలో దుస్తులు మార్చుకోకూడదు.

Alize Cornet Was Warning For Changing Her Top On Court-

Alize Cornet Was Warning For Changing Her Top On Court

అలిజే కోర్టులో షర్టు మార్చుకోవడంపై అంపైర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ కు వ్యతిరేకంగా షర్ట్ మార్చుకున్నందుకు గాను ఆమెను మందలించారు. పురుషులకు మాత్రం ఇలాంటి నిబంధనేమీ లేదు. ఐతే లోదుస్తులు బయటకు కనిపించేలా కార్నెట్‌ వ్యవహరించడాన్ని ఛైర్‌ అంపైర్‌ తప్పుపట్టాడు. అంపైర్ వ్యవహారంపై ఇంటాబయటా విమర్శలు వెళ్లువెత్తడంతో టోర్నీ నిర్వాహకులు రంగంలోకి దిగి ఫుల్‌స్టాప్ పెట్టారు.

Alize Cornet Was Warning For Changing Her Top On Court-

మ్యాచ్ మధ్యలో పురుష క్రీడాకారులు షర్ట్ విప్పేస్తే ఇబ్బంది ఉండదు కానీ క్రీడాకారుణిలు అలా చేస్తే మాత్రం ఎందుకు రాద్ధాంతం చేస్తారు… పురుషులకో న్యాయం… స్త్రీలకో న్యాయమా..? అయినా కార్నెట్ ఉక్కపోతను తట్టుకోలేకనే అలా చేసింది కానీ… కావాలని చేయలేదు కదా అంటూ సోషల్ మీడియా ద్వారా మండిపడుతున్నారు నెటిజన్లు.