బైక్, కార్ కాదు ఏకంగా విమానాన్ని దొంగిలించాడు...చివరికి...  

ఎవరన్నా బైక్ దొంగతనం చేస్తారు..కారు దొంగతనం చేస్తారు..వీడెవడండి ఏకంగా విమానాన్నే కొట్టేయడానికి ప్లానేసాడు.విమానయాన సంస్థలో పనిచేసే ఒక మెకానిక్ విమానాన్ని ఎత్తుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..అసలు విమానాన్ని ఎలా ఎత్తుకెళ్లాడు, ఎత్తుకెళ్లిన విమానం ఏమైంది,ఆ దొంగ ఏమయ్యాడు అనేది ఆధ్యంతం ఆసక్తికరంగా మారింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు…

Alaska Airlines Plane Stolen From SeaTac Airport Then Crashes-

Alaska Airlines Plane Stolen From SeaTac Airport Then Crashes

వాషింగ్టన్‌లోని సీటెల్‌-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అలస్కా ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్‌ అయ్యింది.ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. టేకాఫ్‌కు ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఈ విమానం గాల్లోకి ఎగరడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన అధికారులు.. వెంటనే అప్రమత్తమై రెండు అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ జెట్‌ విమానాల్లో ఆ విమానాన్ని వెంబడించారు.ఏ విధంగా అయితే బైక్,కార్ ఎత్తుకెళ్లిన వారిని వెంబడిస్తారో అలా విమానాన్ని వెంబడించారు ఆకాశంలో.. అయితే అంతలోనే కెట్రాన్‌ ద్వీపం వద్ద ఆ విమానం కుప్పకూలింది.?

Alaska Airlines Plane Stolen From SeaTac Airport Then Crashes-

‘హారిజోన్‌ ఎయిర్‌ క్యూ 400 విమానం సీటెల్‌ విమానాశ్రయం నుంచి అనధికారికంగా టేకాఫ్‌ అయ్యింది. అయితే కొద్ది నిమిషాల్లోనే పియర్స్ కౌంటీలోని కెట్రాన్‌ ద్వీపం సమీపంలో కుప్పకూలింది’ అని అలస్కా ఎయిర్ లైన్ ట్వీట్ చేసింది. ప్రమాద సమయంలో విమానంలో మెకానిక్ మినహా ప్రయాణికులు, సిబ్బంది లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.మొదట ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అనుమానించిన అధికారులు,చివరికి ఇందులో ఎలాంటి ఉగ్రవాదుల ప్రమేయం లేదని నిర్ధారణకు వచ్చారు.