హరికృష్ణ మరణంతో అక్కినేని ఫ్యాన్స్‌కు నిరాశ..  

సినిమా పరిశ్రమలో ఎవరైనా ప్రముఖులు చనిపోతే పలు సినిమా కార్యక్రమాలు రద్దు చేస్తూ ఉంటారు. సినిమా విడుదల విషయం పక్కన పెడితే ఆడియో వేడుకలు, టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ వంటివి వాయిదా వేసుకుంటూ ఉంటారు. తాజాగా అక్కినేని హీరో విషయంలో ఇదే జరిగింది. నందమూరి హరికృష్ణ మరణించిన రోజునే నాగార్జున పుట్టిన రోజు అనే విషయం తెల్సిందే. నాగార్జున పుట్టిన రోజును అక్కినేని హీరోలు మరియు అక్కినేని ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ప్లాన్‌ చేసుకున్నారు.

Akkineni Family Movie Postponed Due To Hari Krishna Death-

Akkineni Family Movie Postponed Due To Hari Krishna Death

హరికృష్ణ మరణంతో నాగార్జున అన్ని క్యాన్సిల్‌ చేయించాడు. నాగార్జున బర్త్‌డే సందర్బంగా శైలజ రెడ్డి అల్లుడు చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయాలని భావించారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్‌ వస్తుందని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. నేడు లేదా రేపు ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక అఖిల్‌ మూడవ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు. నాగ్‌ బర్త్‌డేకు అఖిల్‌ తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాల్సి ఉంది.

Akkineni Family Movie Postponed Due To Hari Krishna Death-

నందమూరి ఇంట నెలకొన్న విషాదం కారణంగా అఖిల్‌ మూవీ ఫస్ట్‌లుక్‌ను కూడా వాయిదా వేశారు. ఇక నాగార్జున, నానిలు కలిసి నటించిన ‘దేవదాసు’ చిత్రంలోని పాటను కూడా విడుదల చేయాలని భావించారు. అది కూడా ప్రస్తుతానికి వాయిదా వేశారు. మొత్తానికి నాగార్జున బర్త్‌డే వేడుకలు అన్ని కూడా నీరుగారి పోయాయి.

హరికృష్ణ మరణంపై స్పందించిన నాగార్జున.. కొన్ని వారాల క్రితమే చూడక చాలా కాలం అయ్యింది, కలుద్దాం తమ్ముడు అంటూ ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. ఇంతలోనే ఇలా అవ్వడం చాలా బాధాకరం, ఐ మిస్‌యు అన్న అంటూ ట్వీట్‌ చేశాడు. నాగార్జున పాట, చైతూ ట్రైలర్‌, అఖిల్‌ ఫస్ట్‌లుక్‌ అన్ని కూడా హరికృష్ణ అంతిమ సంస్కారాలు పూర్తి అయ్యాక విడుదల చేసే అవకాశం ఉంది.