తిరుమలకు శ్రియ ముసుగు వేసుకుని ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా?     2018-09-01   08:28:58  IST  Ramesh Palla

తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శనంకు సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. సెలబ్రెటీల కోసం ప్రత్యేక దర్శణం మరియు ఇతర ప్రత్యేక వసతులను టీటీడీ వారు కల్పిస్తూనే ఉంటారు. అయితే కొన్ని సార్లు సామాన్య భక్తులు మరియు మీడియా వారి కారణంగా సెలబ్రెటీలు ఇబ్బంది పడటం జరుగుతుంది. దేవుడి సన్నిధిలో కూడా ప్రశాంతత దక్కనివ్వరా అంటూ గతంలో పలు సార్లు సెలబ్రెటీలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్బాలున్నాయి.

Actress Shriya Saran Secret Tirumala Visit-

Actress Shriya Saran Secret Tirumala Visit

తాజాగా తిరుమలకు శ్రియ వెంకటేశుని దర్శనంకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో శ్రియ పూర్తిగా మొహంపై చున్ని కప్పుకుని కనిపించకుండా ప్రయత్నం చేసింది. దర్శనం పూర్తి చేసుకుని వస్తున్న శ్రియను కొందరు గుర్తు పట్టారు. ఫేస్‌ను పూర్తిగా కవర్‌ చేసుకునేందుకు ప్రయత్నించినా కూడా ఆమెను గుర్తు పట్టడంతో ఆమె హడావుడిగా అక్కడ నుండి వెళ్లి పోయింది. మీడియాకు కనీసం మొహం పూర్తిగా చూపించక పోవడంపై ప్రస్తుతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తిరుమలకు వచ్చిన సెలబ్రెటీలు కొద్ది సమయం అయినా మీడియాతో మాట్లాడటం లేదంటే, మీడియాకు ఫొటోలు ఇవ్వడం జరుగుతుంది. కాని శ్రియ మాత్రం కనిపించకుండా వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. శ్రియ ఎందుకు ఇలా చేసిందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. గతంలో ఆమెకు జరిగిన అనుభవం దృష్ట్యా ఇలా మొహంను దాచుకోవాల్సి వచ్చింది అంటున్నారు.

Actress Shriya Saran Secret Tirumala Visit-

శ్రియ చాలా సంవత్సరాల క్రితం తిరుమల వచ్చిన సమయంలో దర్శణం అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుండి ఒక వ్యక్తి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమెకు కోపం వచ్చి అతడి చెంప పగులకొట్టడం జరిగింది. ఆ తర్వాత నుండి జనాల్లోకి వెళ్లాలి అంటే శ్రియ భయపడుతోందని ఈ సంఘటన తర్వాత తేలిపోయింది. సెబ్రెటీలు కొన్ని సార్లు తమ స్టార్‌ స్టేటస్‌ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేందుకు ఇదే మంచి ఉదాహరణ.