నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌పై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు.. అందరి అనుమానం ఇదే!     2018-09-03   08:48:30  IST  Ramesh Palla

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకుంది. మరో మూడు వారాలు మాత్రమే ఈ సీజన్‌ మిగిలి ఉంది. నిన్నటి ఆదివారం ఇంటి నుండి నూతన్‌ నాయుడు ఎలిమినేట్‌ అవ్వడం చర్చనీయాంశం అవుతుంది. కౌశల్‌ తర్వాత అత్యధిక ఓట్లు దక్కడంతో నూతన్‌ నాయుడుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ అంతా భావించారు. గణేష్‌తో పాటు అమిత్‌ బయటకు వెళ్లడం ఖాయం అని అంతా భావించారు. కాని అనూహ్యంగా బిగ్‌బాస్‌ టీం పక్షపాత వైఖరి ప్రదర్శించి నూతన్‌ నాయుడును ఎలిమినేట్‌ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా ఈ విషయమై హీరోయిన్‌ మాధవిలత మాట్లాడుతూ.. నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌తో ప్రేక్షకుల ఓట్లకు విలువ లేకుండా పోయింది. అమిత్‌ కంటే ఎక్కువ ఓట్లు నూతన్‌కు వచ్చాయి అనే సమాచారం క్లీయర్‌గా ఉంది. కౌశల్‌ వల్ల నూతన్‌ నాయుడు సేఫ్‌ అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కేవలం రీ రీ ఎంట్రీలు ఇచ్చాడు అనే కారణంగానే నూతన్‌ నాయుడును హౌస్‌ నుండి బయటకు పంపించడం జరిగింది. ఇలా చేయాలనుకుంటే ప్రేక్షకుల నుండి ఓట్లు అడగడం ఎందుకు అంటూ మాధవిలత ఆగ్రహం వ్యక్తం చేసింది.

Actress Madhavi Latha Serious On Nutan Naidu Elimination-

Actress Madhavi Latha Serious On Nutan Naidu Elimination

మాధవిలత వ్యక్తం చేసిన అనుమానాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నూతన్‌ నాయుడుకు మంచి ఓట్లు దక్కాయి. కౌశల్‌ అభిమానులు భారీ ఎత్తున నూతన్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కాని బిగ్‌బాస్‌ టీం మాత్రం నూతన్‌ నాయుడుకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా అనిపిస్తుంది. ఒకసారి ఎలిమినేట్‌ అయ్యి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్‌ నాయుడు అనారోగ్య కారణంతో మరోసారి బయటకు వచ్చి రీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇలా రీ ఎంట్రీల కారణంగానే నూతన్‌ నాయుడుపై ఇంటి సభ్యులకు కోపంగా ఉంది.

రీ ఎంట్రీ ఇచ్చిన వ్యక్తిని ఫైనల్‌ వరకు తీసుకు వెళ్లడం ఎంత వరకు సమంజసం కాదు అనే ఉద్దేశ్యంతో బిగ్‌బాస్‌ టీం ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. బిగ్‌బాస్‌ షో నిర్వాహకుల నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కౌశల్‌ ఆర్మీ ఈ విషయమై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.